మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకే
మహిళా సంఘాలు దోహదపడతాయి’

📰 Generate e-Paper Clip

ఆదిలాబాద్:  ఇచ్చోడ మండలం గుండివాగు గ్రామంలో వీవో (VO) భవన నిర్మాణానికి సర్పంచ్ గాయక్వడ్ శోభరాణి సోమవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు, సమస్యల పరిష్కారానికి మహిళా సంఘాలు దోహదపడతాయని తెలిపారు. మహిళలకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గాయక్వడ్ గణపతి, వీవోలు పులాజి బాబా, లక్ష్మిబాయి, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments