ఖైరతాబాద్ పెద్ద గణపతి అవతారం మరియు తయారీ ప్రారంభం

📰 Generate e-Paper Clip

ఖైరతాబాద్ : హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ప్రతి సంవత్సరం జరిగే వినాయక చవితి ఉత్సవాల కోసం ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది గణనాథుడు పంచముఖ సంకటహర మహాగణపతి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ అవతారంలో ఐదు ముఖాలు ఉంటాయి.

కర్రపూజతో ప్రారంభమైన తయారీ: నిర్జల ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా కర్రపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంతో విగ్రహ తయారీ పనులకు అధికారికంగా శ్రీకారం చుట్టారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్,రాజ్ కుమార్,వీణ మాధురీ, సందీప్ రాజ్,బాల్కుమార్,రాచప్ప,రాము, సతీష్, రాజ్, వినోద్,సాయి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments