Monday, February 17, 2025

‘గుండాల ‘జంట హత్య కేసులో 12 మంది నిందితులు అరెస్టు



గుండాల గ్రామంలో ప్రశాంత వాతావరణం-జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర.

ఏఎస్పీ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో మూడు బృందాలతో పరారీజంట హత్య కేసులో 12 మంది నిందితులు అరెస్టు.లో ఉన్న నిందితుల కోసం గాలింపులు.……

గుండాల ప్రజల జీవన విధానంలో మార్పుల కోసం శాశ్వత పరిష్కారానికి చర్యలు.…..

ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించిన ఎస్పి.…..

రిపబ్లిక్ హిందుస్థాన్,ఆదిలాబాద్ జిల్లా :

గుండాల గ్రామంలో తలెత్తిన ఘర్షణలకు సంబంధించి 12 మంది నిందితులను అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెడుతున్నట్లు జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర పేర్కొన్నారు. శుక్రవారం ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.


ఇచ్చోడ మండలం గుండాల గ్రామంలో బుధవారం 27న ఒకే కమ్యూనిటీకి చెందిన ఇరువర్గాల ఘర్షణలో ఇద్దరు అన్నదమ్ములు హత్యకు గురికావడం, నలుగురు మహిళలతోపాటు ఏడుగురికి గాయాలు కావడంతో చికిత్స కోసం పోలీసులు ఆసుపత్రికి పంపించగా ప్రస్తుతం కోలుకుంటున్నారు.ముగ్గురు తీవ్రంగా గాయపడినవారిలో సిరాజ్ తో పాటు కుటుంబీకులను హైదరాబాద్ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందించడంతో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర


ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గుండాల గ్రామంలో ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు రెండు హత్య కేసులతో పాటు తొమ్మిది కేసులు నమోదు చేసినట్లు తెలిపారు, బాధితులకు పూర్తిగా న్యాయం చేయడానికి సమగ్ర దర్యాప్తు చేపట్టి ఘర్షణకు పాల్పడిన వారిలో మొత్తం 41 మంది నిందితులను గుర్తించినట్లు తెలిపారు. బుధవారం ఉదయం గుండాల గ్రామ సమీపంలో తాగి ఉన్న 12 మంది నిందితులను అరెస్టు చేశామన్నారు, నిందితులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన అనంతరం పోలీసు కస్టడీకి తీసుకొని సమగ్ర దర్యాప్తు చేపడతామని తెలిపారు.

నిందితుల వద్ద నుండి స్వాధీనం చేసుకున్నా గొడవలో వాడిన గొడ్డలి, కత్తులు , కర్రలు

అరెస్టు చేసిన నిందితుల వద్ద గొడ్డలి, కత్తులు కర్రలు స్వాధీనం చేసుకున్నామన్నారు, పరారీలో ఉన్న నిందితుల కోసం ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో మూడు బృందాల పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నిందితులు ఎక్కువ రోజులు తప్పించుకోలేరని మహారాష్ట్ర పోలీసుల సహకారం తీసుకుంటున్నామన్నారు. తప్పు చేసిన వారికి కఠిన శిక్షలు తప్పవని, నిందితులు వెంటనే పోలీసులకు లొంగి పోవాలని సూచించారు. ఈ ఘర్షణలకు సంబంధించిన కేసుల సమగ్ర దర్యాప్తు పూర్తి చేసి తుది నివేదిక న్యాయస్థానంలో ప్రవేశపెడతామని తెలిపారు. నిందితులకు కఠినంగా శిక్షపడేలా గట్టి సాక్ష్యాలతో పాటు సాంకేతిక పరిజ్ఞానం జోడిస్తున్నట్లు తెలిపారు.

ఘర్షణలకు దారి తీసిన నేపథ్యం,

గుండాల గ్రామంలో ముల్తానీలుగా పిలువబడే ఓకే కమ్యూనిటీకి చెందిన ప్రజలు అందరూ బంధువులే, కాలక్రమానుసారం రాజకీయ మార్గంలో రెండు వర్గాలుగా విడిపోయి శత్రువులుగా మారారని తెలిపారు. ప్రతి ఏటా ఉర్సూ ఉత్సవాల్లో ఇరు వర్గాలు పరస్పరం గొడవలు పడుతుండడంతో ఈ సారి ముందు జాగ్రత్త చర్యగా ఉత్సవాలకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. అయినా సర్పంచ్ వర్గీయులు ఉత్సవాలకు ఏర్పాట్లు చేయడంతో మైక్ సౌండ్ పెద్దగా పెట్టడంతో ఎంపిటిసి వర్గీయులు అడ్డుకొని, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆగ్రహం చెందిన సర్పంచ్ వర్గీయులు మారణాయుధాలతో విచక్షణ రహితంగా దాడులు చేసి ఇళ్లు,వాహనాలు ధ్వంసం చేస్తూ ఇరువురిని దారుణంగా హత్య చేసి, మరికొంత మందిని గాయపర్చారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే ఇచ్చోడ పోలీసులు గ్రామానికి వెళ్లి పరిస్థితులను అదుపు చేశారు.

భారీగా ప్రాణ నష్టం కలగకుండా ఇరువర్గాలను విడదీశారు. తద్వారా వెనువెంటనే వందమంది పోలీసు బలగాలతో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర గ్రామానికి వెళ్లి పరిస్థితిని పూర్తిస్థాయిలో అదుపు చేశారు. గ్రామంలో ప్రజలతో మాట్లాడి శాంతింపజేశారు. అల్లరిమూకలు మళ్లీ ఘర్షణ పడకుండా హింస పునరావృతం కాకుండా గ్రామం పోలీసుల ఆధీనంలో తీసుకొని, చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు, 12 పికెట్లు ఏర్పాటు చేసి గట్టి బందోబస్తు నిర్వహించారు, ఇద్దరు హతుల అంత్యక్రియలు సైతం గురువారం ప్రశాంతంగా జరగడంతో ప్రస్తుతం పూర్తిస్థాయిలో ప్రశాంత వాతావరణం నెలకొని ఉందన్నారు.

సకాలంలో పోలీసులు రంగప్రవేశం చేయడంతో భారీగా ప్రాణ నష్టం జరగకుండా నివారించడంలో సఫలీకృతులయ్యారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఘర్షణలకు సంబంధించి 9 కేసులు నమోదు చేశామని, హత్య కేసులో 12 మంది ప్రధాన నిందితులను మారణాయుధాలతో సహా అరెస్టు చేశామని తెలిపారు. ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో మూడు బృందాలు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏఎస్పి హర్షవర్ధన్, ఇచ్చోడ సిఐ వై. రమేష్ బాబు,కంప రవీందర్, వెంకటేష్ ఎస్ఐలు ఉదయ్ కుమార్, షేక్ ఫరీద్, భరత్ సుమన్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.

అరెస్టయిన 12మంది ప్రధాన నిందితులు.

  1. అబ్దుల్ రషీద్, (54) గ్రామ సర్పంచ్.
  2. షేక్ అస్లం (33)
  3. షేక్ అస్గర్ (55)
  4. షేక్ షఫత్ @ సదద్ (30)
  5. షేక్ సద్దాం (32)
  6. శేఖర్ రబ్బాన్ (28)
  7. షేక్ జుమ్మా (30)
  8. షేక్ మూసా (20)
  9. షేక్ హాషం (33)
  10. షేక్ అమీద్ @ అమీర్ (42)
  11. షేక్ అల్లావుద్దీన్ (32)
  12. షేక్ జలీల్ (35)

ఈ పన్నెండు మంది ఈరోజు ఉదయం గుండాల గ్రామానికి వస్తుండగా ఇచ్చోడ సీఐ వై రమేష్ బాబు ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. అనంతరం విచారించగా నిందితులు నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిపారు. హత్యలు చేసిన అనంతరం దాచి ఉంచిన మారణాయుధాల ఆచూకీ నిందితులు చెప్పగా ఘటనా స్థలానికి వెళ్లి ఇద్దరూ పంచుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

Translate »
మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి