🔶 ఏజెన్సీ లో అక్రమ కట్టడాల వల్ల ఆదివాసీల ను వ్యాపార పరంగా దూరం చేస్తున్నారు...
🔶 అక్రమ లే అవుట్ల వల్ల ధరలు పెంచడం వల్ల ఆదివాసీల మనుగడ కష్టం గా మారింది….
🔶 ఆదిలాబాద్ డి ఎల్ పి ఓ కు వినతిపత్రం సమర్పించిన ఏజెన్సీ పరిరక్షణ కమిటీ & ఆదివాసీ నాయిక్ పోడ్ ఉద్యోగ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారి కృష్ణ
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70 ఏజెన్సీ చట్టాన్ని తుట్లు పొడుస్తు, అక్రమ కట్టడాలు నిర్మించిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఏజెన్సీ పరిరక్షణ కమిటీ & ఆదివాసీ నాయిక్ పోడ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారి కృష్ణ ఆదిలాబాద్ డి ఎల్ పై ఓ ధర్మరాణి కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతు ఏజెన్సీ చట్టాలను పకడ్బందిగా అమలు చేయాలని అన్నారు. ఏజెన్సీ లో అక్రమ కట్టడాల వల్ల ఆదివాసీలను వ్యాపార పరంగా దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ లే అవుట్ల వల్ల భూముల ధరలు పెంచడం వల్ల ఆదివాసీలు మనుగడ కష్టం గా మారిందని అన్నారు.
ఏజెన్సీ గ్రామాల్లో గిరిజనేతరులకు బినామీగా ఉంటున్నా వారి ని ఎస్టీ హోదా నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ 1/70 చట్టానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన లే అవుట్ల పై, అక్రమ కట్టడాల పై చర్యలు తీసుకోవాలని లేని పక్షం లో ఉద్యమం తీవ్రం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమం లో ఏజెన్సీ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు మహేందర్, ఉప అధ్యక్షుడు మురళి కృష్ణ, జిల్లా కమిటీ ఆనందరావు, బిపిన్ గౌడే , సర్పంచ్ సునీతా, ఉపసర్పంచ్ శిరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments