సౌదీ అరేబియా : అల్ హాస నగరంలో సాటా ఈస్టర్న్ రీజియన్ ఆధ్వర్యంలో కామ్రేడ్ డాక్టర్ సురేష్ గారికి ఘన నివాళి కార్యక్రమం నిర్వహించారు. మార్చి 14న విజయవాడలోని కృష్ణా నదిలో ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు మునిగి ఆయన మరణించిన విషయం తెలిసిందే.
డాక్టర్ సురేష్ గారు సాటా ఈస్టర్న్ రీజియన్ తొలి సమావేశం అయిన జూన్ 4, 2022 నుంచి గత సంవత్సరం వరకు సంస్థ నిర్వహించిన సోషల్ సర్వీస్ కార్యక్రమాలు, మెడికల్ అవగాహన కార్యక్రమాల్లో ఎంతో చురుకుగా పాల్గొని సేవలందించారు. ఆయన సేవలను ఈ సందర్భంగా సభ్యులు స్మరించుకున్నారు.
ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు ప్రార్థించారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన హరీష్ బొబ్బా గారికి, అల్ ఆయున్కు చెందిన తెలుగు వారి శేఖ రెస్టారెంట్ యజమాని శ్రీనివాస్ కట్టా గారికి, వేదికను అందించిన షిఫా హాస్పిటల్ యాజమాన్యానికి, ఏర్పాట్లను సమన్వయం చేసిన శ్రీకాంత్‌కు సాటా కోర్ టీమ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
అలాగే ఈ కార్యక్రమానికి జెడ్డా నుంచి విచ్చేసిన సాటా ఫౌండర్ మల్లేశ్ గారు, సౌకత్ అలీ గారికి ధన్యవాదాలు తెలిపారు. రామిరెడ్డి గారు ఏర్పాటు చేసిన భోజన విందు అందరినీ ఆకట్టుకుందని సభ్యులు పేర్కొన్నారు.
జూబైల్, హారాధ్, కతీఫ్, ధమ్మం, ఖోబార్ తదితర ప్రాంతాల నుంచి హాజరైన శ్రేయోభిలాషులకు సాటా ఈస్టర్న్ రీజియన్ కోర్ టీమ్ కృతజ్ఞతలు తెలియజేసింది.
అల్ హాసలో కామ్రేడ్ డాక్టర్ సురేష్‌కు ఘన నివాళి
RELATED ARTICLES


Recent Comments