ఆర్థిక సాయం కోరుతున్న రైతులు
Thank you for reading this post, don't forget to subscribe!రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్ : బజార్ హత్నూర్ మండలం, బుర్కపల్లి గ్రామంలో శుక్రవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. రోజువారీగా మేతకు వెళ్లిన 20 ఆవులు జొన్న లేత మొలకలు (లాప) తినడం వల్ల మృతి చెందాయి. ఈ విషయం తెలుసుకున్న మండల రెవెన్యూ అధికారి గిరిదావర్ రాథోడ్ నూర్ సింగ్ సంఘటనా స్థలాన్ని సందర్శించి, గ్రామ రైతులతో మాట్లాడారు. జొన్న లేత మొలకలు మేయడం వల్ల ఆవులు మరణించినట్లు రైతులు తెలిపారు.
మరణించిన ఆవుల యజమానుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
- బర్ధవాల్ నానాక్ సింగ్ – 3 ఆవులు
- టాక్ డా నానాక్ సింగ్ – 4 ఆవులు
- మాటవాన్ గులాబ్ సింగ్ – 1 ఆవు
- సబడే చందర్ సింగ్ – 1 ఆవు
- బర్ధవాల్ గురువే సింగ్ – 1 ఆవు
- జాతీవే న్యాల్ సింగ్ – 1 ఆవు
- జాతీవే సుభాష్ – 1 ఆవు
- నిస్తే హుషార్ సింగ్ – 2 ఆవులు
- బనియ రామ్ – 1 ఆవు
- భామన్ పర్షు రామ్ – 1 ఆవు
- బస్సి హర్ సింగ్ – 1 ఆవు
- మాటవాన్ కాపుర్ చందు – 2 ఆవులు
- మాటవాన్ గోపి చందు – 1 ఆవు
మొత్తం 13 మంది రైతులకు చెందిన 20 ఆవులు మరణించాయి. ఒక్కో ఆవు సుమారు 20,000 రూపాయల విలువైనదని, మొత్తం 4 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. తమ జీవనాధారమైన ఆవులను కోల్పోయిన రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.
రైతులు ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు. అధికారులు సంఘటనపై విచారణ జరుపుతున్నారు.
Recent Comments