Tuesday, November 11, 2025

రోడ్లపై పశువులను వదిలే యజమానులపై కేసులు నమోదు

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

  • రోడ్లపై నిర్లక్ష్యంగా ఉన్న పశువుల వల్ల ప్రమాదాలు.
  • ఇచ్చోడ వద్ద జరిగిన ప్రమాదం లో పశువుల యజమానిపై కేసు నమోదు.
  • ప్రమాదంలో 13 మందికి గాయాలు, ఒకరి మరణం.

– – ఉట్నూర్ ఏఎస్పి కాజల్ సింగ్ ఐపీఎస్

ఇచ్చోడ :  మండలంలోని కోకస్మన్నూర్ వద్ద జరిగిన బస్సు లారీ ఆటో ప్రమాదంలో నిర్లక్ష్యంగా రోడ్డుపై పశువులను వదిలిన యజమానిపై కేసు నమోదు చేసినట్లు ఉట్నూర్ ఏఎస్పి కాజల్ సింగ్ ఐపీఎస్ తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యజమానుల పట్ల తీవ్రంగా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.

ఈ జంతువులు వాహన ప్రమాదాలకు కారణమవుతాయి, ఆస్తికి నష్టం కలిగిస్తాయి మరియు ట్రాఫిక్ను అడ్డుకుంటాయి, ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయి అని తెలిపారు. కోకస్ మనూర్ వద్ద జరిగిన ప్రమాదంలో పశువుల యజమాని రావు సబ్ షిండే ముక్రా కె గ్రామానికి చెందిన వ్యక్తి పై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ ప్రమాదంలో 13 మందికి గాయాలైనయని ఒక మహిళ చనిపోవడం జరిగిందని తెలిపారు.

ప్రమాద దృశ్యం ( ఫైల్ ఫోటో )

పశువుల యజమానులు తమ జంతువులను సరిగ్గా భద్రపరచాలని మరియు రోడ్ల దగ్గర నిర్లక్ష్యంగా వదిలివేయవద్దని తెలిపారు. పాటించకపోతే జరిమానాలు మరియు చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.

Utnoor ASP Kajal Singh IPS said that a case has been registered against the owner who left the cattle on the road negligently in the bus-lorry-auto accident. She warned that strict legal action will be taken against the negligent owners.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!