ePaper
Tuesday, April 14, 2026
📄 ePaper

పేదింటిని యువతి ఉద్యోగం సాధించింది

📰 Generate e-Paper Clip


అదిలాబాద్,హిందుస్థాన్ : పట్టుదల ఉంటే సాధించనిది ఏమీ లేదు.. చదువుకు పేదరికం అడ్డు కాదని నిరూపించింది. హర్షద పాటిల్. ఆదిలాబాద్ పట్టణంలోని రణదీవ్ నగర్ కాలనీ లో నివాసముంటున్న హర్షద పాటిల్ పేదరికం నుంచి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించారు. తండ్రి భారత్ పాటిల్ తల్లి శోభ పాటిల్ కు మూడో సంతానం హర్షద పాటిల్ తండ్రి కూలినాలు చేసి చదివించారు. తండ్రి కష్టాన్ని గమనించిన హర్షదా పాటిల్ ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని నిర్ణయించుకుంది ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన తర్వాత గ్రూపు వన్ లాంటి పరీక్షల్లో ర్యాంకు సాధించి పేద ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఆమె ముందుకు వెళుతుంది.

రణధీవ నగర్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి ఉత్తీర్ణులైన ఆమె ఇంటర్మీడియట్ లో ఎం ఎల్ టి  వోకేషనల్ కోర్సు తీసుకుని 88.5% మార్కులు సంపాదించింది అంతటితో ఆమె ఆగకుండా ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని పట్టుదలతో ముందుకెళ్లింది. మొదట ఉట్నూరు కమ్యూనిటీ ఆసుపత్రిలో ఔటసోరసింగ్ బేసెస్ కింద ల్యాబ్ టెక్నీషియన్ గా జాయిన్ అయింది. ఆమె ఉద్యోగం చేస్తున్న సమయంలో ఈఎస్ఐలో గవర్నమెంట్ కాంట్రాక్ట్ పోస్ట్ లు పడడంతో ఆమె దరఖాస్తు చేసుకుంది 200 మంది వరకు దరఖాస్తులు చేసుకోగా 200 మంది అభ్యర్థుల్లో హర్షద పాటిల్ మొదటి స్థానంలో ర్యాంకు సంపాదించి ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగాన్ని సంపాదించుకుంది. ఎంత కష్టమైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకోవాలని ఆమె పట్టుదలతో ఉంది అదే సమయంలో ప్రభుత్వం ల్యాబ్ టెక్నీషియన్లు భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆమె దరఖాస్తు చేసుకుంది అయితే ఆమె జోన్ పరిధిలోని SC కోటాలో Zone-2 (Basara zone)మూడవ ర్యాంకు సంపాదించుకుంది. ప్రస్తుతం ప్రభుత్వ వైద్య కళాశాల జగిత్యాలలో ల్యాబ్ టెక్నీషియన్ Gr. II ఉద్యోగం సంపాదించింది ప్రస్తుతం ల్యాబ్ టెక్నీషియన్ గా జగిత్యాలలో పనిచేస్తుంది ఆమె. ఈ సందర్భంగా ల్యాబ్ టెక్నీషియన్ హర్షద పాటిల్ ఆరోగ్యజ్యోతి తో మాట్లాడుతూ పేదరికం చదువుకు అడ్డు కాదని ఆమె తెలిపారు ఎన్నో కష్టాలు అనుభవించి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించానని ఆమె తెలిపారు పేద ప్రజలకు అన్ని రకాల సేవలు అందించాలంటే తను గ్రూప్ వన్ లో ర్యాంకు ఖచ్చితంగా సంపాదించి పేదలకు సేవ చేస్తానని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!