రియాద్, సౌదీ అరేబియా 17 జూలై 2026 : సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) తరఫున ఖాజా ముజమ్మిల్ ఉద్దీన్, మొహమ్మద్ నూరుద్దీన్, వీరపల్లి యోగేశ్వరరావు భారత రాయబారి డా. సుహేల్ అజాజ్ ఖాన్ గారికి ఏర్పాటు చేసిన వీడ్కోలు సన్మాన కార్యక్రమంలో పాల్గొని సన్మానించే అవకాశం లభించింది.
ఆల్ ఇండియా స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో రియాద్‌లోని హాలిడే ఇన్ అల్-ఖస్ర్, ఒలయా హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారతీయ ప్రవాసులు, వివిధ భారతీయ సంఘాల ప్రతినిధులు, దౌత్యవేత్తలు మరియు పలువురు ప్రముఖులు హాజరై, భారత–సౌదీ అరేబియా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి, అలాగే సౌదీలోని భారతీయుల సంక్షేమానికి డా. సుహేల్ అజాజ్ ఖాన్ గారు అందించిన విశిష్ట సేవలను కొనియాడుతూ వారికి ఘనంగా వీడ్కోలు పలికారు.

సాటా తరఫున పాల్గొన్న ప్రతినిధులు భారతీయ సమాజానికి రాయబారి గారు అందించిన నిరంతర సహకారానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారి భవిష్యత్ దౌత్య బాధ్యతల్లో మరింత ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా సాటా వ్యవస్థాపకులు మల్లేశన్, వివిధ ప్రాంతల అధ్యక్షులు శ్రీనివాస్ మచ్చ, శార్వాణి విద్యాధరాణి, తేజ పల్లెం, పామిరెడ్డి రామిరెడ్డి, అలాగే కోర్ టీమ్ సభ్యులు కోకిల ఒతులూరి , ప్రీతి చౌహాన్, సింగు సురేష్ కుమార్, అహ్మద్ అబ్దుల్ కరీమ్, మొహమ్మద్ అబ్దుల్ గఫ్ఫార్, మిధున సురేష్, ముదిగొండ శంకర్, మురళీకృష్ణ బూసి, లోకేష్ తల్లా, అబ్దుల్ నయీమ్ ఖయ్యూమ్, అహ్మద్ మొహియుద్దీన్ రోజధర్ సయ్యద్ (అస్లాం), ఫణి కుమార్ అయ్యగారి, పెంటపాటి శ్రీచరణ్, మొహమ్మద్ కామిల్, దూడం సంజీవ్, శేఖర్ పడాల శుభాకాంక్షలు తెలియజేశారు.
సాటా రియాద్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మచ్చ మీడియాతో మాట్లాడుతూ సాటా ఎల్లప్పుడూ భారత రాయబార కార్యాలయంతో పాటు అన్ని భారతీయ సంఘాలతో సమన్వయంగా పనిచేస్తూ, ఐక్యత, సాంస్కృతిక సామరస్యం మరియు సౌదీ అరేబియాలో నివసిస్తున్న భారతీయుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.


Recent Comments