ePaper
Tuesday, April 7, 2026
📄 ePaper

అమరావతి రాజధానికి చట్టబద్ధత – ఎన్‌ఆర్‌ఐ టిడిపి సభ్యుల హర్షం

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

అమరావతి/సౌదీ : ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన బిల్లుపై రాష్ట్రపతి సోమవారం సంతకం చేశారు. అనంతరం కేంద్ర న్యాయశాఖ సంబంధిత గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీంతో అమరావతి అధికారికంగా రాష్ట్ర రాజధానిగా స్థిరపడింది.

ఈ చారిత్రాత్మక నిర్ణయంపై సౌదీ అరేబియాలోని ఎన్‌ఆర్‌ఐ టిడిపి సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి స్వామి స్వర్ణ (స్వామి), మహేంద్ర వాకాటి, శివ దబ్బకూటి, రవి మేడూరి, హరీష్, మోహన్ గురజాల, శ్రీదేవి, జ్యోతి, విద్య తదితరులు మాట్లాడుతూ, 12 సంవత్సరాల నిరీక్షణ అనంతరం అమరావతి అధికారిక రాజధానిగా గుర్తింపు పొందడం గర్వకారణమని తెలిపారు.

ఈ సందర్భంగా సాటా రియాద్ అధ్యక్షులు శ్రీనివాస్ మచ్చ మరియు కోర్ టీం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అమరావతి అభివృద్ధి రాష్ట్ర ప్రగతికి దోహదం చేస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!