మైనర్ అమ్మాయి పై అత్యాచార యత్నం చేసిన నిందితుడు అరెస్టు

📰 Generate e-Paper Clip



*అత్యాచారయత్నం కేసులో అదుపులో నిందితుడు, నిందితుడి పై చట్టపరమైన చర్యలు తప్పవు*

*అమల్లో 30 పోలీస్ యాక్ట్, అనుమతులు లేకుండా నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు నిషేధం*

*సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు*

*నిందితునిపై బోథ్ పోలీస్ స్టేషన్లో కిడ్నాప్, పోక్సో కేసు నమోదు*

*అదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి*

బోథ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం జరిగిన అత్యాచారయత్నం కేసు లో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి వివరాలను వెల్లడిస్తూ,

వివరాలలో …. సోమవారం సాయంత్రం సమయంలో బోథ్ లోని మైనర్ అమ్మాయిని కిడ్నాప్ చేసి అత్యాచారయత్నం చేసిన నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. నిందితునిపై కిడ్నాప్, పోక్సో మరియు అత్యాచార కేసులు నమోదు చేయబడినట్లు తెలిపారు.  నిందితునిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని, జిల్లావ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని ఎలాంటి నిరసనలకు, ర్యాలీలకు, ధర్నాలకు అనుమతులు లేవని తెలిపారు. సోషల్ మీడియా పై నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించిన వారిపై చర్యలు తప్పవని తెలిపారు. 30 పోలీస్ ఆక్ట్ ఉల్లంఘన జరిగితే వారిపై చర్యలు తప్పమన్నారు. ఎలాంటి సమస్యలకైనా జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని సంప్రదించాలని సామరస్యతతో చట్ట ప్రకారం పోలీసులు నిందితులపై చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు.
చట్టం దృష్టిలో ప్రతి ఒక్కరు సమానమేనని, తప్పు చేసిన వారు ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని తెలియజేశారు. చట్టాన్ని చేతిలోకి తీసుకునే ప్రయత్నం చేయవద్దని, శాంతిభద్రతల సమస్యలు తలెత్తేల ప్రవర్తించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments