నాలుగు డోసుల వ్యాక్సిన్‌.. అయినా పాజిటివ్‌….

📰 Generate e-Paper Clip

ఇండోర్‌ : నాలుగు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నప్పటికీ ఒక మహిళ కరోనా బారిన పడ్డారు. దుబాయ్ వెళ్లేందుకు ఒక మహిళ (44) ఇండోర్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ మహిళకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమెను అధికారులు విమానం ఎక్కకుండా నిలిపివేశారు. అయితే ఆ మహిళ వివిధ దేశాల్లో నాలుగు సార్లు వ్యాక్సిన్‌లు వేయించుకున్నట్లు తెలిపారు. ఆ మహిళలో ఎలాంటి లక్షణాలు లేవని, ఆస్పత్రిలో చేర్చినట్లు వెల్లడించారు. అదే మహిళకు ఒక రోజు ముందు జరిపిన పరీక్షల్లో నెగెటివ్‌గా వచ్చిందని ఇండోర్‌ చీఫ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ భూరే సింగ్‌ సెటియా తెలిపారు. కరోనా వచ్చిన మహిళ 12 రోజుల క్రితం దుబాయ్ నుండి ఇండోర్‌కు వచ్చారు. జనవరి-ఆగస్టు మధ్య కాలంలో ఆ మహిళ నాలుగు డోస్‌ల వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు వైద్యులు ధ్రువీకరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments