🔶 మద్యానికి బానిసై,మద్యం సేవించి భార్యను చంపి నందున జీవిత ఖైదు శిక్ష, సెక్షన్ 302 IPC కింద రూ 2000/- జరిమానా,201 IPC కింద 3 సం” జైలు శిక్ష రూ. 1000/- జరిమానా విధించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి మంత్రి రామకృష్ణ సునీత
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : మద్యానికి బానిసై, మద్యం మత్తులో భార్యను హత్య చేసిన నిందితుడికి జీవిత ఖైధు శిక్ష పడింది.
కోర్టు శిక్ష పడడానికి ప్రధానంగా ముఖ్య పాత్ర పోషించిన పిపి సంజయ్ వైరగరే, కోర్టు లైజన్ ఆఫీసర్ ఏ ఎస్ ఐ గంగా సింగ్, రూరల్ కోర్టు డ్యూటీ ఆఫీసర్ అనిల్, రూరల్ సీఐ, ఎస్ఐ లను ప్రత్యేకంగా జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి అభినందించారు.
ఈ సందర్బంగా ఎస్పీ కేసు వివరాలను వెల్లడించారు.
ఆదిలాబాద్ గ్రామీణ మండలం లోకారీ గ్రామంలో, బొల్లి లక్ష్మి అనే యువతిని మహారాష్ట్ర రాష్ట్రం బోరి కి చెందిన కోరేవార్ యువరాజ్ (45) సం”లు గత 15 సంవత్సరాల కింద పెళ్లి చేసుకుని లొకారి గ్రామంలో నివాసం ఉంటున్నాడు. పెళ్లి అయిన నాటి నుండి తాగుడుకు బానిసై యువరాజ్ తన భార్యను వేధిస్తూ ఉండేవాడు. పనీపాట లేకుండా భార్య సంపాదన పై జీవనం గడుపుతూ ఉండేవాడు. 2015 సం”లో అతను భార్యతో గొడవ పడుతూ నిప్పు లోకి తోసి వేయగా అందులో పడి ఆమె చేయి కాలిపోయి అప్పటి నుండి ఆమెకు వికలాంగురాలిగా ప్రభుత్వం పెన్షన్ ఇస్తూ ఉండేది. యువరాజ్ తాగి వచ్చి గొడవ చేస్తూ ఆమెకు వచ్చిన పెన్షన్ డబ్బులు కూడా లాక్కుని త్రాగేవాడు. ఇవ్వని ఎడల తనను చంపుతామని బెదిరిస్తూ ఉండేవాడు.
ఇలా ఒక రోజు తేదీ 14.03.2019 న యువరాజ్ సాయంత్రం 6 గంటల సమయంలో అతిగా మద్యం సేవించి భార్య లక్ష్మితో గొడవ చేస్తూ అంకొలి నుండి పెన్షన్ తీసుకుని ఇంటికి రాగా భార్య లక్ష్మీ మెడ చుట్టూ తాడును బిగించి చంపి , బయటకు లాగి ఇంటి ముందర ఉన్న దూలానికి కట్టి వేసి, తన భార్య ఉరివేసుకున్నదని అరుస్తూ అందర్నీ పిలిచాడు.
బొల్లి ఆశన్న ఫిర్యాదు మేరకు అప్పటి ఆదిలాబాద్ గ్రామీణ పోలీస్ స్టేషన్ ఎస్సై ఏ హరిబాబు CR no 28/2019 U/Sec 302 IPC కింద కేసు నమోదు చేయడం జరిగింది. అప్పటి గ్రామీణ సర్కిల్ సీఐ ఎ ప్రదీప్ కుమార్ దర్యాప్తు నిర్వహించి చార్జిషీటు U/ Sec 302,201 IPC కింద నమోదు చేసినారు.
ఇట్టి కేసులో పీ పీ సంజయ్ కుమార్ సాక్షులను ప్రవేశపెట్టి నేరం రుజువు చేయగా, ఈరోజు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మంత్రి రామకృష్ణ సునీత నేరస్తుడు అయిన కురేవార్ యువరాజ్ కు జీవిత ఖైదు U/Sec 302 IPC మరియు రూ 2000/- జరిమానా విధించారు, 201 IPC కింద 3 సంవత్సరాల జైలు శిక్ష రూ 1000/- జరిమానా విధించడం జరిగింది.
ఇట్టి కేసులో సాక్షులను ప్రవేశపెట్టడానికి లైజన్ అధికారి T. గంగా సింగ్, ఏఎస్ఐ., ఆదిలాబాద్ రూరల్ టీఎస్ కోర్ట్ కానిస్టేబుల్ అనిల్ సహకరించడం జరిగింది.
పిపీ సంజయ్ కుమార్ ను,ఆదిలాబాద్ గ్రామీణ సి ఐ బి రఘుపతి, ఎస్ ఐ ఏ హరిబాబు ను, కోర్టు లైజన్ అధికారి టి గంగా సింగ్ ను, కోర్ట్ డ్యూటీ అధికారి అనిల్ ను జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments