— 58 ద్విచక్ర వాహనాలు, 22 ఆటోలు , ఒక లారీ, ఒక మ్యాక్స్ పిక్ అప్ విచారణ నిమిత్తం స్వాధీనం
— రూ.6000/- విలువచేసే నిషేధిత గుట్కా స్వాధీనం, ఇద్దరు నిందితులపై కేసు నమోదు
— 1 డిఎస్పీ,2 సీఐలు,12 ఎస్ఐలతో కలిపి100 మంది పోలీసులతో ఆదిలాబాద్ పట్టణంలోని కె.ఆర్.కె కాలనీ లో కార్డెన్ అండ్ సెర్చ్
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
శుక్రవారం ఉదయం జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదిలాబాద్ పట్టణంలోని కె.ఆర్.కె కాలనీ లో డిఎస్పి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసులతో కార్డెన్ అండ్ సర్చ్ నిర్వహించారు.

ఈ తనిఖీల్లో ఉదయం 5 గంటల నుండి కె ఆర్ కె కాలని చుట్టూ తిరిగి సరైన ధ్రువ పత్రాలు చూపించని వాహనాలను మరియు అనుమానిత వ్యక్తులను రాష్ట్ర ప్రభుత్వ నిషేధించిన పదార్థాలను తనిఖీ చేయడం కోసం కార్డెన్ సర్చ్ నిర్వహిస్తారని వీటివల్ల నేరాల నియంత్రణ , నేరాల తగ్గుముఖం నకు ఎంతగానో దోహదపడుతుందని డి.ఎస్.పి పేర్కొన్నారు.

ఈ తనిఖీల్లో 58 ద్విచక్ర వాహనాలు, 22 ఆటోలు, ఒక లారీ, ఒక మ్యాక్స్ పిక్ అప్ సరైన ధ్రువపత్రాలు లేనందున తాత్కాలికంగా సీజ్ చేయడం జరిగింది. మరియు ఈ తనిఖీల్లో రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన రూ 6000/- విలువగల గుట్కా లభించిందని తెలిపారు. గుట్కా లభించిన వారిపై మావల పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ బి రఘుపతి, జైనథ్ సిఐ కె నరేష్ కుమార్, ఎస్ ఐ లు ఏ హరి బాబు, విష్ణువర్ధన్, విష్ణు ప్రకాష్, దడిక రాధిక ,ప్రవళిక ఆదిలాబాద్ సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments