*జంట హత్యాల కేసులో అల్లుడే నిందితుడు*
రిపబ్లిక్ హిందుస్థాన్, మంథని / వెబ్ డెస్క్ : మంథని పోలీసులు 48 గంటల్లోనే జంట హత్యల కేసులో చాకచక్యంగా వ్యవహరించి కేసును త్వరితగతిన ఛేదించి నిందుతున్ని అరెస్ట్ చేశారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్ లో డిసిపి పెద్దపల్లి రవీందర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు.
*నిందితుని వివరాలు*
పెంట శ్రీనివాస్ s/o రాజయ్య వ.30సం.లు వృత్తి.హార్లిక్స్ కంపెనీ లో హమాలి వర్కర్ r/o వెంకటాపూర్ గ్రామం మంథని మండలం
*నిందితుల నుండి స్వాధీనం చేసుకొన్నా వాటి వివరాలు*
1.నిందుతుడు చంపడానికి ఉపయోగించిన రోకలిబండ
2. Korbon ఫోన్
3. రూ.18,000/- ల నగదు.
*వివరాల్లోకి వెళితే…..*
👉తేదీ 10.05.2022 నాడు అర్ద రాత్రిపూట మంథని మండలం చల్లపల్లి గ్రామంలో కొత్త సాంబయ్య , అతని భార్య లక్ష్మి భార్య బర్తలను లను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపినారు. భుతగాదాలే వల్లనే తన తల్లి తండ్రులను కొత్త యాదగిరి ,ఈసంపల్లి వెంకయ్య, ఈసంపల్లి వనజ, ఈసంపల్లి వినయ్,అనుముల సత్యనారాయణ @ మధు లు చంపినారు అని అనుమానం వ్యక్తం చేస్తూ మృతుల కొడుకు అయిన కొత్త రవి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు వెంటనే ప్రారంభించినట్లు తెలిపారు.

విచారణలో పెంట శ్రీనివాస్ s/o రాజయ్య వ.30సం.లు వృత్తి.హార్లిక్స్ కంపెనీ లో హమాలి వర్కర్ r/o వెంకటాపూర్ గ్రామం మంథని మండలం నేరం చేసినట్లుగా నిరూపణ అయినది.
👉 నిందితుని గాలింపు చర్యల్లో భాగంగా నిందితుడు వెంకటాపూర్ లోని తన ఇంట్లో ఉన్నాడనే నమ్మదగిన సమాచారం మేరకు ఈ రోజు ఉదయం 9 గంటలకు మంథని పోలీసులు నిందితున్ని పట్టుకొని పంచుల సమక్షంలో విచారించగా నేరం ఒప్పుకొన్నారు.
👉 2010 సం.లో మంథని మం. చల్లపల్లి గ్రామానికి చెందినా కొత్త సాంబయ్య రెండవ కూతురు అయిన వసంత తో నిడుతుడికి పెళ్లి అయినది, పెళ్లి తర్వాత హైదరాబాద్ కొంపల్లి లోని ప్రతాప్ హార్లిక్స్ హెల్త్ అండ్ ఫుడ్ కంపనీలో హమాలి వర్కర్ గా పనిచేయుచున్నాడు. నిందితుడు త్రాగుడు బానిసై ఎలాంటి పనిచేయక పోయేసరికి గత కొంతకాలంగా మృతుడు సాంబయ్య చిన్న కూతురు వసంతకు మరియు నిందితుని కి గొడవలు జరుగుతుండేవి. 2 సంవత్సరాల క్రితం వెంకటాపూర్ గ్రామంలో కుల పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరిగినది. పంచాయితి జరిగిన కూడా అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఇష్టం వచ్చినట్లు త్రాగి గొడవలు చేసేవాడు. ఇట్టి విషయమై వసంత తన అమ్మ నాన్న, తమ్ముడుకి ఫోన్ చేసి చెప్పగా , తేది 06.05.2022 నాడు మృతుడు సాంబయ్య కుమారుడు రవి కొంపల్లి కి రావడం జరుగుతుంది. రవి తన అక్క వసంతతో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి పిర్యాదు ఇచ్చినది. తేది 10.05.2022 నాడు డ్యూటీ కి ఎందుకు వేల్తాలేవు అని నిందుతుడు శ్రీనివాస్ ని అడుగగా , భార్య,రవి లతో అతను గొడవ పెట్టుకొని ఇంటి నుండి వెళ్ళుచూ నిన్ను మరియు మీ అమ్మ నాన్న ల అంత చూస్తాను అని బెదిరించినాడు. తన అత్త-మామలు రవిని ఇక్కడకు పంపడం వల్లనే ఇదంతా గొడవ జరిగినది అని వారిని ఎలా అయిన చంపాలని నిర్ణయించుకొని, రాత్రి అందాజ 10 గం.లకు JBS బస్ స్టాండ్ వెళ్లి అక్కడి నుండి కరీంనగర్ కు, కరీంనగర్ నుండి మంథని బస్ పట్టుకొని రాత్రి అందాజ 4 గం.లకు మంథని మండలం పుట్టపాక స్టేజి దగ్గర దిగి నడుచుకుంటూ తన అత్తగారి ఇల్లు చల్లపల్లి కి వెళ్ళినాడు. తను వెళ్ళే సమయానికి మృతుడు సాంబయ్య ఇంటి ముందర షెడ్డులో కూలర్ వేసుకొని మంచం పై పడుకొని ఉన్నాడు. కూలర్ దగ్గరలో గల ఒక రోకలిబండ తీసుకొని అతని తలమీద గట్టిగా కొట్టినాడు, అతను చనిపోయినాడు అని నిర్దారించుకొని ఇంటి డోర్ కొట్టగా అత్త లక్ష్మి డోర్ తీసినది , అదే రోకలి బండ తీసుకొని ఆమె తలపై కొట్టగా అక్కడే క్రింద పడిపోగా, ఇంకా చావలేదు అని ఆమె ముఖం పై గట్టిగా కొట్టగా అక్కడికక్కడే చనిపోయినది.
తన అత్త దాచుకున్న రూ.20,000/- లు దొంగలించుకొని, రోకలి బండను ఆ ఇంటికి దగ్గరలో గల బావిలో పడవేసి అక్కడినుండి పారిపోయినాడు.
👉ఏసీపీ గోదావరిఖని గిరి ప్రసాద్ గారి పర్యవేక్షణలో హత్యకేసు చేదన లో చాకచక్యంగా వ్యవహరించిన సిఐ లు సతీష్ , రాజకుమార్, మంథని ఎస్ఐ చంద్ర కుమార్, రామగిరి ఎస్ఐ రవి ప్రసాద్ , మంథని ఎస్ఐ రాణి మరియు సిబ్బంది మైకాంత్ (CDR Wing)కిరణ్, సదానందం, సురేందర్, వెంకటేశ్, రాకేష్, అనిల్ తదితరులను డిసిపి గారు ప్రత్యేకంగా అభినందించారు
ఈ పత్రికా సమావేశంలో డిసిపి పెద్దపల్లి రవీందర్ గారితో పాటు, గోదావరిఖని ఏసిపి గిరి ప్రసాద్, సిఐ లు సతీష్ , రాజకుమార్, మంథని ఎస్ఐ చంద్ర కుమార్, రామగిరి ఎస్ఐ రవి ప్రసాద్ , మంథని ఎస్ఐ రాణి మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments