రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ ప్రజాకవి కాళోజీ జయంతి ని ఘనంగా జరుపుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో తెలంగాణా ప్రజాకవి కాళోజీ నారాయణరావు యొక్క 107 వ జయంతిని వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త ( అగ్రానమీ ) & హెడ్ డా . శ్రీధర్ చౌహాన్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు . ఈ సందర్భంగా డా. శ్రీధర్ చౌహన్ మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు తెలంగాణా ఉద్యమానికి ఇచ్చిన స్ఫూర్తిని కొనియాడారు .
పుట్టుక నీది , చావు నీది , కాకుండా బతుకంతా దేశానిది అని నినదించిన తెలంగాణ మహనీయుడు వైతాళికుడు , నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా , కలం బలం చూపించిన తెలంగాణ యోదుడు కాళోజీ అని అన్నారు. అలాగే కోవిడ్ -19 సూచలు పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డా . వి . తిరుమల రావ్ , కె . రాజశేకర్ , డా . డి . మోహన్ దాస్ , డా . యం . రాజేందర్ రెడ్డి , ఎస్ ఆర్ ఎఫ్ ఎ . శ్రీకాంత్ మరియు సిబ్బంది యస్ . దేవానంద్ , వై . రవి , వి . శ్రీనివాస్ , సీనియర్ అసిస్టెంట్ , ఏ ఈ ఓ యం . మహేష్ , ఏంటీఎస్ శ్రీ యం . నరేష్ , టి . రాములు , యన్ . అరుణ్ కుమార్ , ఆర్ . నవీన్ , శ్రీ టి . హరీష్ , కె . స్వామి , అవుట్ సోర్సింగ్ సిబ్బంది యం . పోచ్చుబాయి , మరియు పరిశోధన స్థానం నాన్ టీచింగ్ సిబ్బంది , అవుట్ సోర్సింగ్ సిబ్బంది , టైం స్కేల్ మరియు కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు .
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments