రోడ్లు మరమ్మత్తుకు 10 లక్షలు మంజూరు చేసిన ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్
రిపబ్లిక్ హిందూస్థాన్, బోథ్ : బోథ్ మండలం లోని నక్కల వాడ గ్రామపంచాయతీలో గత రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు కురవడంతో నక్కల వాడ బ్రిడ్జి మరియు రోడ్డు పూర్తిగా ద్వంసం కావడంతో గ్రామస్తుల సమాచారం మెరుకు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ సందర్శించారు. ఎంపీపీ తుల శ్రీనివాస్ గ్రామంలో నెలకొన్న సమస్యల పై సమాచారం అందించిన వెంటనే శాసనసభ్యులు హుటాహుటిన ఈ రోజు నక్కల వాడని సందర్శించారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామస్తుల కోరికమేరకు రోడ్డు మరమ్మతు మరియు నిర్మాణం కొరకు రూపాయలు 10 లక్షలు మరియు లక్ష్మీపూర్ గ్రామానికి లక్ష రూపాయలు రోడ్డు మరమ్మత్తుకు తక్షణమే నిధులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ మాట్లాడుతూ మీకు ఎలాంటి ఆపద వచ్చినా మీ వెన్నంటే ఉండి మీయొక్క సమస్యను పరిశీలించి నా వంతు సహకారం అందించి పరిష్కరిస్తానని అభయమిచ్చారు. అలాగే కుచలాపూర్, ధన్నూర్ గ్రామాల్లో కూడా అక్కడి గ్రామస్తుల కోరిక మేరకు రోడ్డు మరమ్మత్తులకు మరియు బ్రిడ్జి నిర్మాణం కొరకు రూపాయలు 3కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదిక పంపిస్తానని తెలియజేశారు. అనంతరం నక్కల వాడ గ్రామస్తులు ఎమ్మెల్యే ను శాలువా తో ఘనంగా సన్మానించారు.


Recent Comments