వాతావరణ సూచన తేది : 08.09.2021 భారతీయ వాతావరణ విభాగం , ప్రాంతీయ కేంద్రం , హైదరాబాద్ ( తెలంగాణా ) వారి సూచన ప్రకారము ఆదిలాబాద్ జిల్లాలో రాబోయే 4 రోజులలో ( 09.09.2021 నుండి 12.09.2021 వరకు ) ఆకాశము మధ్యస్థంగా మేఘావృతమై ఉండును . 09 వ తేదిన 7 మి.మీ ; 10 వ తేదిన 9 మి.మీ .; 11 వ తేదిన 10 మి.మీ ; మరియు 12 వ తేదిన 17 మి.మీ.ల వర్షపాతము ( తేలికపాటి నుండి ఓ మాదిరి మద్య స్థాయిలో వర్షము ) నమోదు కావచ్చును . గాలి గరిష్ట ఉష్ణోగ్రత 31-32 డిగ్రీ సెంటీగ్రేడు గాను మరియు కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెంటీగ్రేడుగా నమోదు కావచ్చును . గాలిలో తేమ ఉదయం పూట 84-92 % గాను మరియు మధ్యాహ్నం పూట 65-75 % వరకు ఉండగలదు . దక్షణం – వాయువ్య దిశగా గంటకు 13-20 కి.మీ.ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది .
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments