రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : శనివారము రోజున వ్యవసాయ శాఖ ఆద్వర్యంలో ఇచ్చాడ డివిజన్ లోని ” ఇచ్చోడ , సిరికొండ , గుడిహత్నూర్ ‘ మండల ఫర్టిలైజర్ షాప్ డిలర్లతో నకిలి పత్తివిత్తనాలు , మరియు ఆన్లైన్ లో విత్తనాల క్రయ , విక్రయాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి డి పుల్లయ్య మాట్లాడుతూ నకిలీ విత్తనాల అమ్మకాలు జరిపినా , నకిలి విత్తనాలు సరఫరా చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటూమన్నారు .
అలాంటి వారి లైసెన్సును రద్దు చేయడంతో పాటు పిడి యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అదే విధంగా విత్తనాల క్రయవిక్రాయాల వివరాలు నమోదు కోసం రాష్ట్ర వ్యవసాయ శాఖ ఒక వెబ్సైట్ ను రూపొందించిదని తెలిపారు. ఈ ఆన్లైన్ విధానం తో ప్రతి డీలర్ వద్ద లాగిన్ వివరాలు ఉంటాయని అన్నారు. ఈ ఆన్లైన్ విధానం ద్వారం నకిలీ విత్తలానాలకు చెక్ పెట్టి విత్తనాల కొరత లేకుండా చూడవచ్చని అన్నారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఇచ్చోడ డివిజన్ ఎడిఏ రామ్ కిషన్, ఏడిఏ రమేష్, , మండల వ్యవసాయ అధికారులు జాదవ్ కైలాష్ , ధామ రేవతి , మండల రెవిన్యూ అధికారి అతికోద్దీన్ , ఇచ్చాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ వై రమేష్ బాబు డిప్యుటీ తహసీల్దార్ జాదవ్ రామారావ్ మరియు ఇచ్చోడ, సిరికొండ , గుడిహత్నూర్ మండలాల డీలర్లు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments