-బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : గత మూడు రోజులుగా ఎడతెరపి కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ,అధికారుల సూచనలు పాటించాలని బోథ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు అన్నారు. మంగళవారం రోజున తన నివాసములో మాట్లాడుతూ బోథ్ నియజకవర్గములోని అన్ని మండలాల ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని,పిల్లల విషయములో జాగ్రత్తలు పాటించాలి,వాగులు,వంకలు దాటే క్రమములో జాగ్రత్త పాటించాలని,ఏదైనా విపత్కారా పరిస్థితులు ఎధెరైతే పోలీసు అధికారులకు,రెవెన్యూ అధికారులకు సమాచారం అందించాలని అన్నారు. అధికారులు 24 గంటలు అందుబాటులో ఉంటారని, భయపడకుండా భరోసాతో ఉండాలని ఎమ్మెల్యే అన్నారు.


Recent Comments