🔶 నిత్యవసర వస్తువులు పంపిణీ
🔶 ఇండ్లు కూలిన బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలి…
బిజెపి నర్సంపేట యువ నాయకులు డా. రాణా ప్రతాప్ రెడ్డి
రిపబ్లిక్ హిందుస్థాన్, ఖానాపురం: మండలంలోని అశోక్ నగర్ గ్రామంలో గత ఐదు రోజులుగా కురిసిన వర్షాలకు గ్రామంలోని నాలుగు కుటుంబాలు బండోజ్ కళమ్మ, ఎల్ది పుష్ప, బండోజ్ సత్యం, వేల్పుల స్టాలిన్ మరియు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిమ్మ రమేష్ కు బిజెపి నర్సంపేట యువ నాయకులు డా. రాణా ప్రతాప్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు. అదేవిధంగా ఇల్లు కూలిపోయిన బాధితులను కలిసి వారితో మాట్లాడి వారికి నిత్యవసర వస్తువులు అందించారు. నర్సంపేట బిజెపి పార్టీ యువ నాయకులు డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ బాధితులతో మాట్లాడి, తాసిల్దార్ ను వివరణ కోరగా పై అధికారులకు నివేదిక పంపించాం అని అన్నారని అన్నారు. అధికారులు వచ్చి చూసి పోయారు తప్ప కనీసం వారికి నిత్యవసర వస్తువులు కూడా అందివలేదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ బాధితుల సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని, స్థానిక ఎంఎల్ఏ ని భారతీయ జనత పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నమని అన్నారు.

గత ఎలక్షన్లో నర్సంపేట శాసనసభ్యులు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని, ఇప్పటికైనా ప్రజల అభివృద్ధి పై చిత్తశుద్ధి ఉంటే నిరుపేదలని గుర్తించి డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేయాలని అన్నారు. గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చాలా మంది నిరుపేదలు ఇల్లు కూలిపోయి చుట్టుపక్కల చుట్టాల ఇడ్లలో ఉండాల్సి వస్తుందని అన్నారు.అధికారులు స్పందించి నిరుపేద బాధితులను ఆదుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో మండలం అధ్యక్షులు ఆబోతు రాజు యాదవ్,మండల ఇంఛార్జి గడ్డం ఆంజనేయులు, బిజెవైఎం మండలం అధ్యక్షులు బూడిద ముకేశ్ ఎస్టి మెర్చ మండలం ప్రధాన కార్యదర్శి ,ఈసం లక్ష్మినారాయణ , జి రాధాకృష్ణ, బి అనిల్, కొత్త మనోజ్,పృధ్వీరాజ్, రమేష్, మహేందర్,ఎల్ది ఉప్పాలయ్య గౌడ్,గుండం ప్రవీన్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments