🔶 బోథ్ మండలం పొచ్చెర జలపాతాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ
🔶 అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచన
🔶 జిల్లా పోలీసు అధికారులందరికీ సూచనలు ఇచ్చిన జిల్లా ఎస్పీ
🔶 ఎటువంటి అత్యవసర సమయంలోనైనా పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్లను సంప్రదించవచ్చు
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : జిల్లాలో గత మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల దృష్ట్య జిల్లా పోలీసు యంత్రాంగం 24 గంటలు అప్రమత్తంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం బోథ్ మండలం పొచ్చర జలపాతాన్ని జిల్లా ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వాగుల,నదుల వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న కల్వర్టులు, కాజ్వే ల వద్ద ప్రమాద హెచ్చరికలు తెలియజేసి, పోలీసు సిబ్బందిని ఉంచి తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.ఎల్లప్పుడూ తమ వెంట గజ ఈతగాలను, తాడును, టార్చ్ లైట్ ను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలను ఇళ్ల నుండి బయటకు రావద్దని సూచించారు. కల్వర్టుల వద్ద నీరు ప్రవహిస్తున్నప్పుడు దాటే ప్రయత్నం చేయకూడదని జాగ్రత్త సూచించారు. ఎలాంటి పరిస్థితుల్లో నైనా తమకు సహాయం కావాలనిపిస్తే డైల్ 100, లేదా జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ నెంబర్ 08732226246, 9490619045 లకు లేదా సంబంధిత పోలీసు అధికారులకు సంప్రదించవచ్చని, నిమిషాల్లోనే తమకు సహాయం అందజేస్తుందని భరోసా కల్పించారు.

Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments