ఒకే కమ్యూనిటీకి చెందిన ఇరు వర్గాల ఘర్షణలో ఇద్దరు మృతి….
ముగ్గురు మహిళలతో పాటు ఏడుగురికి గాయాలు,
ఒకరి పరిస్థితి విషమం, హైదరాబాద్ కు తరలింపు…
పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ….
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్/ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని గుండాల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది… ఇరు వర్గాల ఘర్షణ లో ఇద్దరు అన్నదమ్ములు మృతిచెందారు. గ్రామంలో జరుగుతున్న పరస్పర దాడుల పై సమాచారం అందిన వెంటనే జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, 100 మంది సాయుధ బలగాలతో సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితులను అదుపులో తెచ్చారు.
బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇచ్చోడ మండలం గుండాల గ్రామంలో ఇరువర్గాలు ఘర్షణ పడుతున్నట్లు సమాచారం అందుకున్న ఇచ్చోడ ఎస్సై షేక్ ఫరీద్ ఘటనా స్థలానికి చేరుకోవడంతో, గ్రామ ప్రజలు ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో వెంటనే జిల్లా ఎస్పీకి సమాచారం అందించడంతో ఎస్పీ రాజేష్ చంద్ర, వెంటనే నిర్మల్ ఎస్పి సిహెచ్ ప్రవీణ్ కుమార్ కు సమాచారం అందించి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.

వచ్చీ రావడంతోనే ఘర్షణ పడుతున్న ఇరు వర్గాలను వెంటనే చెదరగొట్టారు.
అనంతరం పరిస్థితులు అదుపులోకి రావడంతో నిర్మల్, కూమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల నుండి అదనపు బలగాలను రప్పించి గుండాల గ్రామాన్ని పూర్తిగా పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు.

గ్రామంలో 12 పికెట్లు ఏర్పాటు చేసి ప్రశాంత వాతావరణం కల్పించారు.
సత్వరమే పోలీసులు స్పందించడంతో ఇరువర్గాలకు భారీ ప్రాణ నష్టం జరగకుండా కాపాడినారు.
ప్రస్తుతం గ్రామంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితి తలెత్తకుండా సాయుధ బలగాలతో మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు.
ఘర్షణ తలెత్తడానికి గల కారణాలు.
గుండాల గ్రామ సర్పంచ్ షేక్ రషీద్, ఒక వర్గానికి నాయకత్వం వహిస్తుండగా మరో వర్గానికి ఎంపీటీసీ కుటుంబానికి చెందిన షేక్ మోబీన్ నాయకత్వం వహిస్తున్నాడు.
ఇద్దరూ ఒకే కమ్యూనిటీకి చెందిన ఇరువర్గాల మధ్య గత కొంతకాలంగా రాజకీయ కక్షలు కొనసాగుతున్నాయి.
బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో సర్పంచ్ షేక్ రషీద్ ఆధ్వరంలో ఉర్సు ఉత్సవాలు డిజె సౌండ్ బాక్స్ లతో గ్రామంలో జరుపుకుంటున్న క్రమంలో షేక్ మొబీన్ వర్గీయులు అడ్డు వచ్చి అనుమతి లేని ఉర్సు ఉత్సవాలు ఎందుకు జరుపుకుంటున్నారని. నిలదీయగా.. ఇద్దరి మధ్య ఘర్షణ ప్రారంభమైంది. మోబిన్ వర్గీయులు అనుమతి లేకుండా డిజె సౌండ్ బాక్స్ తో ఉర్సు ఉత్సవాలు జరుపుకుంటున్నారని పోలీసులకు సమాచారం అందించడంతో,, సర్పంచ్ వర్గీయులు.. ఉత్సవాలను అడ్డుకోవడంతో పాటు పోలీసులకు సమాచారం ఇస్తారా అంటూ కోపోద్రిక్తులై మోబీన్ వర్గీయులపై, గొడ్డలి, కత్తులు, కర్రలతో దాడులు చేయగా, ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ ఘటనా స్థలంలోనే మృతిచెందగా, ఇరువర్గాలకు చెందిన ముగ్గురు మహిళలతో పాటు ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

మృతి చెందిన వ్యక్తులు.
గుండాల గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు.
షేక్ జహీరుద్దీన్ (60)
షేక్ ఝాన్ (55)
వీరితో పాటు ఇరు వర్గాలకు చెందిన ముగ్గురు మహిళలు, నలుగురు వ్యక్తులు గాయపడ్డారు.
ఇందులో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి.
ఇచ్చోడ పోలీసులు క్షతగాత్రులను చికిత్సకోసం రిమ్స్ ఆదిలాబాద్ ఆస్పత్రికి తరలించారు.
మృతదేహాలను పోస్ట్ మార్టం నిర్వహించడానికి బోథ్ ఆస్పత్రికి తరలించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ
గుండాల గ్రామంలో ఉదయం చెలరేగిన దాడిలో ఇరువర్గాలకు చెందిన వ్యక్తులు కర్రలు, కట్టెలు, గొడ్డళ్లతో పరస్పరం దాడులు చేసుకోవడంతో ఇరు వర్గాలకు చెందిన వ్యక్తులు గాయపడ్డారు. ఇద్దరు మృతికి కారణమైన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు.
సకాలంలో పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో ఇరువర్గాల మధ్య మరింత ఘర్షణ తలెత్తకుండా అడ్డుకున్నారు.
వచ్చి రావడంతోనే అల్లరి మూకలను చెదరగొట్టి ఇరువర్గాలను శాంతింప జేసి ఘర్షణకు గల కారణాలను లోతుగా తెలుసుకున్నారు.
ఈ ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన ఇండ్లు దెబ్బతిన్నాయని, దర్యాప్తు చేసి నాల్గు కేసులు నమోదు చేశామని తెలిపారు.
గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పే వరకు సాయుధ పోలీసుల పికెటింగ్ కొనసాగుతుందని తెలిపారు.
ఇప్పటివరకు ఘర్షణ కు సంబంధించిన 23 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు.

గుండాల గ్రామంలో మకాం చేసిన పోలీసు అధికారులు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్,
నిర్మల్ జిల్లా ఎస్పీ సిహెచ్ ప్రవీణ్ కుమార్, అదనపు ఎస్పీ రామ్ రెడ్డి, డిఎస్పి వెంకటేశ్వరరావు, సిఐలు, వై రమేష్ బాబు, కొంక మల్లేష్,
స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జే. కృష్ణమూర్తి, సిసిఎస్ సిఐ ఈ చంద్రమౌళి, ఉట్నూర్ సిఐ ఐ సైదారావు, 20 మంది ఎస్సైలు 200 సాయుధ పోలీసు బలగాలను మోహరించారు.
ఖవాలీ ( ఉర్సు ఉత్సహాలకు ఆహ్వానిస్తున్నట్లు ఉన్న పోస్టర్ )

Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments