— 42 ఈ- చలాన్ కేసులకు రూ.40,200/- ఫైన్ నమోదు, మరియు పెండింగ్లో ఉన్న రూ.14,700/- కట్టిన వాహనదారులు
— ట్రాఫిక్ సిఐ కే మల్లేష్
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : గురువారం రొజు ఆదిలాబాద్ పట్టణంలో జిల్లా ఎస్ పి డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణ ట్రాఫిక్ సీఐ కే మల్లేష్ మరియు సిబ్బంది ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియమాలు పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు . ఈ స్పెషల్ డ్రైవ్ ముఖ్య ఉద్దేశం నంబర్ ప్లేట్ సరిగా లేని వాహనాలను, నంబర్ ప్లేట్ లేని వాహనాలను, రిజిస్ట్రేషన్ చేసుకోని వాహనాలపై, మైనర్ పిల్లల వాహనాలు నడపడం, అనే అంశాలపై కొనసాగిందని ట్రాఫిక్ సీఐ తెలిపారు. ఈ సందర్భంగా 5 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. మరియు 42 ఈ చాలన్ కేసులను నమోదు చేసినట్లు వీటికి గాను రూ 40,200/- ఫైన్ విధించినట్లు తెలిపారు. వాహనదారులపై పెండింగ్లో ఉన్న రూ.14,700/- ఈ చలాన్ డబ్బులు కట్టినట్టు తెలిపారు. వాహనదారులు అందరూ తమ వాహనాలను ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ నడపాలని తెలియజేశారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments