
— గాజుల రాకేష్
బిజెపి సోషల్ మీడియా
9951439589
బిసి ల అభ్యున్నతికి తోడ్పాటు నిస్తోంది బిజెపి మాత్రమే
గడిచిన దశాబ్దకాలంగా బీసీ నినాదం కాంగ్రెస్ కు కేవలం ఓటు బ్యాంకుగా మారి వారి గెలుపుకు బాటలు వేశాయి కానీ కాంగ్రెస్ బీసీలను పప్పులో కరివేపాకు లాగా మాత్రమే వాడుకున్నారు తప్పితే ఏ రంగంలోనూ బీసీలకు అవకాశాలు కల్పించలేదు.
ఇదే సమయంలో బిజెపి ఓట్ల కోసం బీసీ లను మచ్చిక చేసుకోకపోయినప్పటికీ అవకాశం దొరికినప్పుడల్లా బిసి లను అందలం ఎక్కిస్తూ బీసీలపై బిజెపి చిత్తశుద్ధి నిరూపించుకుంటుంది.
తెలంగాణలో బీసీ వర్గాల రాజకీయ సాధికారతపై గత కొన్ని దశాబ్దాలుగా జరిగిన ప్రయత్నాలు పూర్తి స్థాయిలో విజయం సాధించలేక పోయాయి.
కాంగ్రెస్ పార్టీ బీసీలను ఉన్నత రాజకీయ పదవుల్లో చూడాలనే అనేక ప్రణాళికలను ప్రకటించింది కానీ అవి కేవలం అబద్దాలు, మాయమాటలు, రాజకీయ కోణానికే పరిమితం అయ్యాయి.
బీసీల ప్రగతికి అవకాశాలను ఇవ్వకపోవడం, హామీలను అమలు చేయకపోవడం, వాటిని నిరంతరంగా మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి సాధారణమయ్యింది.
కానీ *బిజెపి మాత్రం చిత్తశుద్ధితో బిసి ముఖ్యమంత్రిని ప్రకటించి ఎన్నికలకు వెళ్ళినా కాంగ్రెస్ ఇచ్చిన ఉచిత హామీల ముందు తెలంగాణ ప్రజలకు సీఎం కుర్చీ చిన్నదయ్యింది*.
అయినా బిజెపి బీసీ సాధికారతకు వెనక్కి తగ్గలేదు ఎందుకంటే గత 11 ఏండ్లుగా భారత ప్రధానిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మోదీ ని కూర్చోబెట్టి పాలన సాగిస్తుంది.
అంతేకాకుండా బిజెపి కి రాజకీయంగా, సామాజికంగా అవకాశం దొరికినప్పుడల్లా బలహీన వర్గాల ప్రగతికి కృషి చేస్తుంది. *నిన్న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని గెలిపించడం ద్వారా, బీజేపీ తన గట్టి సంకల్పాన్ని, వైఖరిని స్పష్టంగా ప్రజలకు తెలియచేసింది*.
అంతకుముందు *ఒక దళిత వ్యక్తిని, ఒక గిరిజన వ్యక్తిని రాష్ట్రపతి స్థానంలో కూర్చోబెట్టడం కూడా బీజేపీ నే చేసింది*.
కేంద్ర మంత్రిత్వంలో 27 మంది బీసీ ఎంపీలు, 85 మంది పార్లమెంట్ సభ్యులు ఉండటం బీసీ సామాజిక వర్గానికి బిజెపి అండగా ఉందన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి.
*కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీసీ వర్గాలకోసం కనీసం జనాభా నిష్పత్తి ప్రకారం మంత్రి పదవులు ఇవ్వకపోవడం, నామినేటెడ్ పదవులను నిర్లక్ష్యం చేయడం, కామారెడ్డి డిక్లరేషన్ నీ కూడా కాంగ్రెస్ అమలుచేయక పోవడం వారి ద్వంద నీతికి నిదర్శనం*.
కాంగ్రెస్ పార్టీ బీసీల హక్కులను నిరంతరంగా మోసం చేస్తూ వచ్చింది.
బిజెపి నుండి ప్రస్తుతం ఇద్దరు ముఖ్యమంత్రులు బిసి లుగా కొనసాగుతున్నారు.తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి ప్రకటన చేసినప్పటికీ అది సాధ్యం కాలేదు.
కాంగ్రెస్ బీసీలపై ప్రేమ ఒలకబోస్తూనే ఉప రాష్ట్రపతి అభ్యర్థి బిసి నీ నిలబెట్టే అవకాశం వచ్చినప్పటికీ కాంగ్రెస్ తమ జిత్తుల మారి నక్క బుద్ధి ప్రదర్శించి రెడ్డి సామాజిక వర్గానికి అవకాశాన్ని కల్పించింది.
మరో వైపు *బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంటూనే 42 లో 12 శాతం ముస్లిం సామాజిక వర్గానికి కేటాయిస్తూ బిసి లకు న్యాయంగా రావాల్సిన రిజర్వేషన్లను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుంది*.
*బీసీలపై కాంగ్రెస్ పార్టీ వైఖరి*
👉 దేశ చరిత్రలో కాంగ్రెస్ పాలనలో బీసీలకు “రాజకీయ ప్రాధాన్యం” తక్కువగా ఇచ్చారు.
👉 అధికారం, ముఖ్యమంత్రి పదవులు, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి స్థాయిలో బీసీలకు అవకాశాలు చాలా అరుదుగా ఇచ్చారు.
👉 బీసీల హక్కులు కాపాడడంలో కంటే, కుల రాజకీయాలు నిర్వహించడంలో కాంగ్రెస్ ఎక్కువ శ్రద్ధ పెట్టింది.
*బీసీల కోసం బిజెపి వైఖరి*
👉 మొదటి సారి దేశానికి బీసీ ప్రధాన మంత్రి – శ్రీ నరేంద్ర మోడీ గారు .
👉 కేంద్ర మంత్రిమండలిలో 71 మంత్రులలో 27 మంది OBC వర్గానికి చెందిన మంత్రులు ఉన్నారు.
👉 లోక్ సభలో 303 బిజెపి ఎంపీ లలో 85 (27%) మంది OBC లున్నారు.
👉 BJP శాసన సభ్యులు 1,358 లో 27% శాతం OBC లున్నారు.
👉 BJP MLC 163 మంది సభ్యుల్లో 40% ఓబీసీ లున్నారు.
👉 ఉప రాష్ట్రపతిగా OBC వ్యక్తి బిజెపి గెలిపించుకుంది.
👉 బీసీలను కేవలం ఓట్ల కోసం కాకుండా, పాలనలో భాగస్వామ్యం చేసుకుంది బిజెపి.
👉2002లో డాక్టర్ A.P.J. అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా చేసింది బిజెపి .(ముస్లిం సమాజం నుంచి).
👉2017లో రామ్ నాథ్ కోవింద్ గారిని (SC – దళిత వర్గం) రాష్ట్రపతిగా చేసింది బిజెపి.
👉2022లో ద్రౌపది ముర్ము గారిని (ST – ఆదివాసీ వర్గం) రాష్ట్రపతిగా చేసింది బిజెపి.
👉 పథకాల రూపంలో బీసీల అభివృద్ధికి బిజెపి బాధ్యత వహించింది
స్ట్రీట్ వేండర్ల కోసం పీఎం స్వనిధి,
చిన్న వ్యాపారాల కోసం ముద్రా లోన్స్,
స్టాండప్ ఇండియా, OBC స్కాలర్షిప్స్ మొదలైనవి అందిస్తుంది.
👉 హక్కుల పరిరక్షణ కోసం OBC Reservation ను బలపరచడం, జాతీయ OBC కమిషన్ కు రాజ్యాంగ హోదా ఇవ్వడం బిజెపి మార్క్ రాజకీయం.
మొత్తంగా బీజేపీ బీసీలను అధికారంలో భాగస్వామ్యం చేసి, వారి అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు తీసుకొచ్చింది.బిసి వర్గాల ప్రగతికి అవకాషాలను అందించడం, హక్కులను రక్షించడం, నిజాయితీతో పనిచేయడం, రాజ్యాంగపరమైన బాధ్యతను బీజేపీ చూపించింది.
అబద్దాల వాగ్దానాలతో బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తూనే ఉంది. కాంగ్రెస్ బీసీలను రాజకీయంగా ఉపయోగించింది కానీ అధికారంలో చోటు కల్పించలేదు.
ఉప రాష్ట్రపతి ఎన్నికకు బిసి అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఆ పని చేయలేదు.
*ఉపరాష్ట్రపతిగా సి. పి. రాధాకృష్ణన్ ఎన్నిక ద్వారా బిజెపి బిసిల అభ్యున్నతి కోసం అండగా నిలుస్తుందని ఒక బలమైన సందేశాన్ని చాటి చెప్పింది.
Recent Comments