ePaper
Monday, March 16, 2026
📄 ePaper

తెలంగాణ మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

హైదరాబాద్ : తెలంగాణలో మద్యం ప్రియులకు రాష్ట్ర సర్కార్ బ్యాడ్ న్యూస్ తెలుపనుంది త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా బీర్ల ధరలు పెంచే యోచన లో ఉన్నట్టు తెలిసింది.

సాయంత్రం అయ్యిందంటే చాలు బార్లలో మందు బాబులతో కిటకిటలాడుతుంటాయి. రోజురోజుకు లిక్కర్‌ అమ్మకాలు జోరుగా పెరిగిపోతున్నాయి. అయితే ధర ఎంత ఉన్నా అమ్మకా లు మాత్రం ఆగవు. ఇక తెలంగాణ రాష్ట్రంలో బీర్ల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

ఎందుకంటే బిర్ల తయారీ కేంద్రాల, బ్రూవరీల కు ప్రస్తు తం ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలను 10 నుంచి 12 శాతం మేర పెంచాలని నిర్ణయించినట్టు సమా చారం. ఈ భారం విని యోగదారులపైనే పడనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆరు బ్రూవరీల్లో ఏటా 68 కోట్ల లీటర్ల బీరు తయారుఅవుతోంది.

ఆ బీరును తెలంగాణ రాష్ట్రంబేవరేజెస్‌ కార్పొ రేషన్‌ లిమిటెడ్‌ టీస్ సబీసీఎల్‌ కొనుగోలుచేసి.. మద్యం దుకాణాలకు సరఫరా చేస్తోంది. ఈ నేపథ్యం లో 12 బీర్ల కేసుకుగాను బ్రూవరీలకు టీఎస్‌బీసీఎల్‌ రూ.289 చెల్లిస్తోంది.

పన్నులన్నీ కలు పుకొని కేసుకు రూ.1400 చొప్పున రిటైలర్లకు మద్యం దుకాణాలు విక్రయిస్తుండగా.. ఇతర ఖర్చులన్నీ కలిపి మద్యం దుకాణాల వారు కేసు రూ.1800 చొప్పున విక్రయిస్తున్నారు.

అంటే.. ఒక్కో బీరునూ ప్రభుత్వం బ్రూవరీల వద్ద రూ.24.08కి కొనుగోలు చేసి రూ.116.66కి మద్యం దుకాణాలకు విక్రయి స్తుండగా.. వినియోగదా రుడి వద్దకు వచ్చేసరికి ఒక్కో బీరు ధరా రూ.150, నుంచి 160,అవుతోంది. రాష్ట్రంలో బీర్ల డిమాండ్‌కు తగ్గట్టు ప్రభుత్వ ఆర్డర్లపై బ్రూవరీలు బీర్లను ఉత్పత్తి చేస్తాయి.

చివరిసారిగా రెండేళ్ల క్రితం 2022 మే నెలలో 6శాతం చొప్పున రెండుసార్లు పెంచింది. నిర్వహణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఈసారి 20-25 శాతం పెంచాలంటూ బ్రూవరీలు ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేర పెంచినట్లయితే ధరలను పెంచాల్సి ఉంటుంది.

దీంతో ఈ ప్రభావం మందు బాబుపై పడే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం వినియోగదారులపై భారం ఎక్కువగా ఉంటుందని భావించిన ప్రభుత్వం 10-12 శాతం వరకూ పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం.

కొత్త ధరలు వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్నట్టు తెలిసింది. ఒక వేళ ధరలు పెంచాలని నిర్ణయిస్తే కేవలం బీర్లపైనే పెంచనున్నారు.   మిగతా వాటి ధరలు అలాగే ఉండనున్నట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!