ePaper
Monday, March 16, 2026
📄 ePaper

KCR: వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్న కేసీఆర్

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!


హైదరాబాద్ :
బీఆర్ఎస్ brs అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కోటుకుంటు న్నారు. హిప్‌ రిప్లేస్‌మెంట్‌ తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స అనంతరం డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే.

సర్జరీ ( surgery) తర్వాత ముందుగా హైదరాబాద్ నందినగర్ లోని ఆయన ఇంటికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌ కు చేరుకున్నారు. ఫామ్ హౌస్ ( kcr farm house ex cm ) లో వైద్యుల పర్యవేక్షణలో కేసిఆర్ చికిత్స తీసుకుంటున్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు, సహాయకులు ఎప్పటికప్పుడు పర్యవే క్షిస్తున్నారు.

ప్రస్తుతం కేసీఆర్‌ ఊత కర్ర సాయంతో నడుస్తున్నారు. అయితే, సర్జరీ నాటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితిపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆరా తీస్తు న్నారు.

ప్రస్తుతం ఫామ్ హౌస్ లో కెసిఆర్ నడుస్తున్న వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫాం X లో ఎంపీ సంతోష్ కుమార్ పోస్ట్ చేశారు. మరింత దృఢ సంకల్పంతో కేసీఆర్‌ త్వరలోనే ప్రజల ముందుకు వస్తారని ఎంపీ సంతోష్ కుమార్ పోస్ట్ చేయడం విశేషం…

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!