రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
బోథ్ మండలానికి సమీపంలో మహారాష్ట్రలో సరిహద్దుకి వెళ్లి మట్కా ఎక్కువగా ఆడుతున్నారని సమాచారంతో అందడంతో బోథ్ సిఐ నైలు స్థానిక ప్రజలకు మట్కా, జూదం వంటి వ్యసనాల బారిన పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని హితవుపలికారు. బొథ్ మండలంలోని కొంతమంది ప్రజలు మట్కా ఆట వ్యసన భారిన పడి డబ్బులు వృధా చేసుకుంటూ జీవితాలు, కుటుంబాలు నాశనం చేసుకుంటున్నారని అన్నారు. మట్కా జోరుగా ఆడుతున్నట్లు సమాచారం మెరకు బోథ్ సిఐ నైలు బోథ్ మరియు సోనాల బస్టాండ్ లలో ఆటో స్టాండ్లలలో, టీ హోటల్ల వద్ద ఆకస్మిక తనిఖీలు చేస్తూ కొంతమంది యువకుల మరియు మట్కా ఆటకు వ్యసనమైన వారి సెల్ ఫోన్లు తనిఖీ చేస్తూ మట్కా కు సంబంధించిన చీటీలను వారి ఫోన్లలో ఉన్న మట్కా లావాదేవీలు చెక్ చేస్తూ, తిరిగి ఇలాంటి మట్కా ఆట ఆడితే చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటామనీ వినని యెడల కేసులు నమోదు చేస్తామని ఒక ప్రకటనలో హెచ్చరించారు.
మట్కా ఆడితే చట్యరీత్యా చర్యలు తప్పవు : సిఐ ఎం నైలు
RELATED ARTICLES
Recent Comments