రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో సోమవారం రోజు 40 నిమిషాలకు పైగా ట్రాఫిక్ స్తంభించి పోవడం తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్టీసీ బస్సులు, స్కూల్ వాహనాలు ట్రాఫిక్ లో ఇరుక్కపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ద్విచక్రవాహానాలు, ఆటోలు, పాదాచారులు ఏ దారిగుండా బయటపడాలో తేలియక పరేషాన్లో పడ్డారు.

150 ఫిట్లు రోడ్డు కేవలం 15 ఫిట్లు కూడా ఖాళీ లేకుండా చిరు వ్యాపారాలు రోడ్డు పై ఇష్టానుసారంగా తోపుడు బండ్లు ఆపడం తో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమవుతుంది. అప్పుడప్పుడు స్థానిక వ్యాపారులు సరుకులు తీసుకొచ్చే భారీ వాహనాలు రోడ్ల కడవరకు అపి ఉంచడం వల్ల కూడా సాధారణ ప్రజానీకంబ్బందులు పడుతున్నారు. ఒక పక్క దుమ్ము, అస్తవ్యస్తంగా ఉన్న ట్రాఫిక్ జామ్ వల్ల నిత్యం ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి.


Recent Comments