Monday, February 17, 2025

దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురి అరెస్ట్

🔴 7 లక్షల 50 వేల వస్తువులు స్వాధీనం

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ /ఉట్నూర్ : ఆదిలాబాద్ జిల్లా రాత్రి పూట ఇళ్ళలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను ఉట్నూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి 5 లక్షల రూపాయలు విలువ గల బంగారు వెండి ఆభరణాలు మరియు 2 లాప్ టాప్ లు, 1 MI టివి, స్పీకర్, హెడ్ ఫోన్ మరియు సెల్ ఫోనులు మొత్తం 7 లక్షల 50 వేల వస్తువులు స్వాధీనము చేసుకున్నారు.

పట్టుబడిన నిందితులలో ఉట్నూర్ మండలం అంగడి బజార్ కి చెందిన డ్రైవర్ గ పనిచేసే నిఖిల్ (20), కొమ్ముగూడ కు చెందిన ప్రయివేట్ ఉద్యోగి అయినా మేకల రన్ (21), గంగన్న పేటకు చెందిన స్టూడెంట్ అయినా గాజుల సాయికుమార్ (19), గంగన్న పేటకు చెందిన కార్పెంటర్ అయినా బండి పవన్ కళ్యాణ్ (22) యువకులు పట్టుబడినట్లు ఉట్నూర్ సీఐ సైదరావ్ తెలిపారు.

*దొంగతనాలకు ఎంచుకున్న తీరు*

ఈ సందర్భంగా ఉట్నూర్ సీఐ సైదరావ్ వివరాలను తెలియజేస్తూ నిందితులు నలుగురు కలిసి జల్పా లకు అలవాటుపడి ఉట్నూర్ గ్రామములొ రాత్రిపూట తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను తాళం పగులగొట్టి దొంగిలించిగా వచ్చిన సొమ్ముతో జల్పాలు చేసుకోవడం.

*నిందితులు చేసిననేరాలు*

1) అంగడి బజార్ లొ విట్టల్ రావు ఇంటి తాళం పగల గొట్టి అ ఇంటి లొకి ప్రవేసించి మూడు బంగారు గాజులు, బంగారము గొలుసు, మరియు ఒక్క లెన్నొ కంపని లాప్ టాప్ దొంగలించి, ఇట్టి దొంగలించిన వస్తువులను ఉట్నూర్ గ్రామము గంగన్నపెట్ కు చెందిన A-3 బండి పవన్ S/o మల్లయ్య కు అమ్మగా దాని బదులుగా మాకు బండి పవన్ పది వెయిల రుపాయాలు ఇవ్వగా అట్టి డబ్బులతో మద్యం తాగి జల్పాలు చేసినామని నిందితులు తెలిపారు.

2). సుభాస్ నగర్ లొ నల్లోల్ల చంద్రకాంత్ ఇల్లు తాళం పగల గొట్టి ఆ ఇంటి లోకి ప్రవేసించి వెండి గిన్నెలు, రెండు బంగారు గాజులు, మరియు ఐదు వెయిలు రుపాయాలు దొంగలించినారు.
3)సేవాదాస్ నగర్ లొ రథోడ్ రాజు తాళం పగల గొట్టి ఆ ఇంటిలోకి ప్రవేసించి ఒక్క ఎం.ఐ కంపెని టి.వి ని దొంగలించారు.

4) అంగడి బజార్ పోరండ్ల భాస్కర్ ఇంటి తాళం పగల గొట్టి ఆ ఇంటిలోకి ప్రవేసించి, అ ఇంటిలొ నుండి ఎచ్.పి లాప్ టాప్, చిన్న స్పీకర్, ఫోన్ హెడ్ సెట్, ఒక్క సెల్ ఫోన్ దొంగలించినారు.
5). సుభాష్ నగర్ జాదవ్ శ్రీనివాస్ ఇంటి తాళం పగల గొట్టి అ ఇంటిలోకి ప్రవేసించి రెండు బంగారు ఉంగరాలు దొంగలించినారు.

ఇట్టి విషయమై ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు అయ్యాయి. ఈ విషయం లో ఆదిలాబాద్ ఎస్పి ఉదయ్ కుమార్ రెడ్డి సూచనల మేరకు, ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్ అదేశాలమేరకు ఉట్నూర్ ఎస్సై సుమన్, మరియు సిబ్బంది తో కలిసి విశ్వసనియ సమాచారంతో బుధవారం ఉదయం ఉట్నూర్ ఆర్టిసి బస్టాండ్ వద్ద పెట్రోలింగ్ చేయుచుండగా నిందితులు ఐన A1) పందెన నిఖిల్ s/o శ్రీనివాస్ A2) మెకల కరన్ S/o కిష్టయ్య, A3) గాజుల సాయి కుమార్ S/o అశోక్ లను పట్టుకొని పంచుల సమక్షంలో విచారించగా అతను పైన తెలిపిన నేరాలను స్వచ్చందంగా ఒప్పుకొని మరో నిందితుడు అనగా వీరి దొంగ సొమ్మును కొన్న A4). బండి పవన్ S/o మల్లయ్య, పై దొంగ తనంలు చేసిన నిందితులును పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఉట్నూర్ సిఐ సైదారావు, ఎస్సై భరత్ సుమన్ సిబ్బంది అయిన పిసి సూర్య, మరియు హెచ్ సి నాగన్న, లక్ష్మీనారాయణ, లను ప్రత్యేకంగా ఆదిలాబాద్ ఎస్.పి ఉదయ్ రెడ్డి అభినందించారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

Translate »
మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి