రిపబ్లిక్ హిందుస్థాన్ , బోథ్ : అదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రం లోని ఆదివాసీ భావనంలో ఆదివాసీ సర్పంచ్ ల సంఘం సమావేశం నిర్వహించారు.,
ఈ సందర్బంగా ఆదివాసీ సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు పంద్రం శంకర్ మాట్లాడుతూ ఆదివాసీ గ్రామాలలో నెలకొన్న సమస్యల పరిష్కరానికి సర్పంచ్ లు బాధ్యత తీసుకోవాలని, గ్రామ అభివృద్ధితో పాటు ఆదివాసుల విద్య,ఆర్ధిక ,సామజిక అభివృద్ధికి పాటుపడాలని అన్నారు .
సమస్యల పరిష్కరానికి అధికారులతో సమన్వయం కలిసి పనిచేయాలని అన్నారు . ఈ సమావేశం లో కార్యదర్శి దుర్వ సింధు విశ్వేశ్వర్ రావు ,ఉపాధ్యక్షులు జూగ్నక్ మారుతీ, సెడ్మాకి సురేష్, పి సంగ్రాం, రాందాస్ ఎంపీటీసీ సిడం శంబు, ఆయా గ్రామాల ఆదివాసీ సర్పంచ్ లు ఎంపీటీసీ లు పాల్గొన్నారు.
Recent Comments