కువైట్ సిటీ,ఏప్రిల్ 05: కువైట్‌లోని అబ్బాసియా ప్రాంతంలో అనుమతి లేకుండా ప్రార్థనా సమావేశం నిర్వహించినందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్న 12 మంది భారతీయులు (మలయాళీలు) ఎట్టకేలకు విడుదలయ్యారు. వీరిలో ఒక పాస్టర్‌తో పాటు ఆరోగ్య మంత్రిత్వ శాఖలో పనిచేసే కొందరు ఉద్యోగులు కూడా ఉన్నారు. అబ్బాసియాలోని ఒక భవనం బేస్మెంట్లో రహస్యంగా ప్రార్థనలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సమయంలో అక్కడ ఉన్న 12 మందిని జునూబ్ అల్-సుర్రాలోని జాతీయ భద్రతా విభాగం అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.
విడుదల: బాధితుల బంధువుల నిరంతర కృషి, ఉన్నతాధికారుల జోక్యంతో అదుపులోకి తీసుకున్న వారందరినీ తాజాగా విడుదల చేశారు.
హెచ్చరిక: ప్రస్తుతం ప్రాంతీయ ఉద్రిక్తతల దృష్ట్యా కువైట్ ప్రభుత్వం బహిరంగంగా గుమిగూడటం, వేడుకలు జరుపుకోవడంపై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో, ఈస్టర్ పండుగ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడకూడదని, నిబంధనలు అతిక్రమించవద్దని సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నారు.


Recent Comments