బిజెపి పాలనలో ప్రజలపై భారాలు

📰 Generate e-Paper Clip

అధివాసి కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్

నిర్మల్ జిల్లా :  బిజెపి పాలన ప్రజలపై భారలు ప్రజల మధ్య విద్వేషాలు పెంచటం తప్పదేశానికి చేసింది శూన్యమని ఆదివాసి కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్ విమర్శించారు.ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ తప్పు నియమాలతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.పెట్రోల్ డీజిల్ ధరలను వాయిదాల పద్ధతిలో పెంచడానికి మోడీ ప్రభుత్వం పూనుకుందన్నారు ఇప్పటికే 3.50  భారం వేసిన మోడీ రానున్న రోజుల్లో మరింత పెంచడానికి సిద్ధమవుతుందన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు మూగీయటంతోనే ప్రజల నుంచి వసూళ్ల దందా ప్రారంభించిందని ఆరోపించారు. సామాన్య ప్రజలకు భారంగా మారే నిర్ణయాలు తీసుకుంటే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments