రిమ్స్ లో నెలకొన్న సమస్యల పై కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు ….
రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్ : రిమ్స్ ఆస్పత్రి లో నెలకొన్న సమస్యలపై జిల్లా కలెక్టర్ సిక్న పట్నాయక్ ను ఆదిలాబాద్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ సామ రూపేష్ రెడ్డి తన కార్యకర్తల తో కలిసి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగ సామ రూపేష్ రెడ్డి మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కోట్ల రూపాయలతో వెచ్చించి నిర్మించిన ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన రోగులను సమస్యలు వెంటాడుతున్నాయి అన్నారు. కానీ వీటిని పట్టించుకోవాల్సిన అధికారులు మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు.రోగులు పడుతున్న ఇబ్బందుల దృష్ట సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు రిమ్స్ డైరెక్టర్,అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు.ఒకపక్క సెల్ కౌంటర్ యంత్రం, మరోపక్క sigmoidoscopy పనిచేయకపోవడంతో టెస్టుల కోసం వచ్చే రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి వేలకు వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. కూలినాలి చేసుకునే పేదలు మెరుగైన వైద్యం కోసం రిమ్స్ కు వస్తే అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా రిమ్స్ లో పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా వీటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడంతో పాటు గతంలో తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నామన్నారు. అదేవిధంగా రిమ్స్ లో రోగులకు అందిస్తున్న అన్నదానం సరిగా ఉండటం లేదన్నారు. అనారోగ్యంతో వచ్చిన వారికి అందించే ఆహారాన్ని తినలేక పోతున్నారు. నాణ్యతతో కూడిన భోజనం రోగులకు అందించేలా చూడాలని జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగిందన్నారు.ఇదే విషయంపై పలుమార్లు అధికారులను కలవడం జరిగిందన్నారు. కానీ సంబంధిత కాంట్రాక్టర్ ఇంత నిర్లక్ష్యం వహిస్తున్న అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పటికైనా పేదల ఆరోగ్యంను దృష్టిలో ఉంచుకొని రోగులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు, కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని అదేవిధంగా పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేసేలా చూడాలని జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగిందన్నారు. సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. కలిసిన వారిలో ఎస్సీ సెల్ మావల మండల అధ్యక్షుడు భూమేష్, జైనథ్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు గంగన్న, శ్రీకాంత్, సంతోష్ తదితరులు ఉన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments