తెలుగు మీడియా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది….. : సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషణ
తెలుగు మీడియా పై దుమ్మెత్తి పోస్తున్న సోషల్ మీడియా…
మెగా హిరోకు జరిగిన ఆక్సిడెంట్ ను భూతద్దం లో చూపిస్తు రేప్ ఆండ్ మర్డర్ కాబడిన పసిపాప విషయాన్ని నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపిస్తుంది సోషల్ మీడియా వేదికగా సమాజికం..

ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ప్రతి న్యూస్ చానెల్ టీఆర్పీయే శ్వాసగా వార్త లను ప్రసారం చేస్తుందనేది వాస్తవమైన విషయం… దానికనుగునంగానే ప్రేక్షకులు ఏమి చూడటానికి ఆసక్తి కనబర్చుతారో అలాంటి వార్తలను ప్రసారం చేయటానికే మొగ్గు చూపుతారు… ఇక తాజాగా టాలీవుడ్ సెలబ్రిటీ మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి సంబంధించి ఏమైందో, ఎలా ఉందో, ఎలా అయిందో అని తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ప్రేక్షకులకు ఉండటం వలనే ఈ పరిస్థితి దాపురించిందని నేను అనుకుంటున్నాను…
అయితే మీడియా దృష్టి కోణం లో హిరో ఆక్సిడెంట్ ని చిన్నదిగా తీసిపారేయలేము ఎందుకంటే అతను సెలబ్రిటీ కాబట్టి మీడియా కు అది పెద్ద వార్తే అవుతుంది…
అయితే అదే సమయంలో జరిగిన రేప్ అండ్ మర్డర్ అయినా పాప విషయం కూడ పెద్దది..కాదు చాల పెద్దది… అంటే మీడియా దృష్టి లో రెండు పెద్ద సంఘటనలు ఒకే సమయంలో జరగడం… రెండింటికి ప్రాముఖ్యతను ఇస్తూ సరిసమానంగా ప్రియారిటి కేటాయిస్తు వార్తను నడపాల్సిన బాధ్యత ప్రతి చానేల్ పెద్దలపై ఉంటుంది…
ఇక్కడ హిరో ఆక్సిడెంట్ ను హైలేట్ చేసి పాప రేప్ విషయాన్ని నిర్లక్ష్యం చేశారనేది సుస్పష్టం కాబట్టి పూర్తిగా తెలుగు మీడియా తప్పు చేస్తుందనేది నా అభిప్రాయం…
పసిపాప రేప్ అండ్ మర్డర్ విషయంపై మీడియా ఎందుకు ఫోకస్ చేయలేకపోయింది, ఎందుకు నిర్లక్ష్యం చేసిందనేది ప్రస్తుతం అందరిలో మెదళ్లలో తొలుస్తున్న సందేహం… ఈ విషయం పై మీడియా మౌనం జనం ఆగ్రహానికి కారణం అవుతుంది…సమాజంలో ఇప్పటికే ఛీత్కరింపులను ఎదుర్కుంటున్న మీడియా ఇలాంటి విషయాల వల్ల జనాల నమ్మకాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి…….
రాసిన వారు ప్రముఖ విశ్లేషకులు : జాధవ్ కిరణ్ , సీనియర్ జర్నలిస్ట్
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.