షీ టీం అవగాహనతో బాధితురాలుకి జరిగిన అన్యాయం బట్టబయలు, నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు
*ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో బాధితురాలి తండ్రి ఫిర్యాదు, కేసు నమోదు.…
*రూ.10 ఇచ్చి లైంగిక వాంఛ తీర్చుకున్న నిందితుడు.*
*నిందితుడు బంగారిగూడ కు చెందిన జాదవ్ కృష్ణ అరెస్టు.
*వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో బి ఎన్ ఎస్ మరియు ఫోక్సో యాక్ట్ తో కేసు నమోదు.
– షీ టీం ఇన్చార్జ్ ఏఎస్ఐ బి సుశీల
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు షీ టీం బృందం వివిధ కళాశాలలో పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్థులకు మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
ఈ కార్యక్రమాల నిర్వహిస్తున్న సమయంలో ఆదిలాబాద్ పట్టణంలోని ఒక పాఠశాల నందు షీ టీం బృందం మహిళల పట్ల విద్యార్థుల పట్ల గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ లపై అవగాహన కల్పిస్తున్న సందర్భంలో ఒక విద్యార్థిని షీ టీం బృందాన్ని సంప్రదించి తనతో జరుగుతున్న అన్యాయాన్ని వివరించింది.
వెంటనే స్పందించిన షీ టీం బృందం కుటుంబ సభ్యులకు వివరాలను వెల్లడించి, తండ్రి ద్వారా ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించగా నిందితుడు *జాదవ్ కృష్ణ బంగారిగూడ ఒక చెందిన వ్యక్తి ప్రతిరోజు అమ్మాయికి ₹10 ఇస్తూ చాక్లెట్లు బిస్కెట్లు కొనిస్తూ మైనర్ అమ్మాయి పట్ల లైంగికంగా వేధించిన సందర్భంలో అతనిపై ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో పోక్సో మరియు బిఎన్ఎస్ చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు షీ టీం బృందం ఇన్చార్జ్ బి సుశీల తెలియజేశారు.
నిందితుడు ప్రతిరోజు ఈ 10 సంవత్సరాల మైనర్ బాలికతో లైంగికంగా వేధిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించడం జరుగుతుందని తెలిపారు. మహిళలు విద్యార్థిని విద్యార్థులు ఎలాంటి అసౌకర్యం కలిగిన, లైంగిక వేధింపులకు గురైన, ఆదిలాబాద్ షీ టీం బృందం అండగా ఉంటుందని తెలిపారు. షీ టీం ని సంప్రదించాలంటే 8712659953 నెంబర్ కి ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని, సమాచారం కూడా అందించవచ్చని అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో షీ టీం బృంద సభ్యులు వాణిశ్రీ, మహేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments