
* జైశ్రీరామ్ మరియు ఇతర బ్రాండ్ల పేరు గల బ్యాగులలో పిడిఎస్ రైస్ నింపి, ప్రజలకు అధిక ధరలకు అమ్ముతున్న మోసగాళ్లు.
* ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో 79 క్వింటార్ల 30 కిలోల రాయితీ బియ్యం స్వాధీనం.
* నూతన పద్ధతులతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్న నేరగాళ్లు.
* ముగ్గురిపై ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు, ఇద్దరి అరెస్ట్.
* పిడిఎస్ రైస్ అమ్మే నేరస్తులపై సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయబడతాయని హెచ్చరిక.
– – పిడిఎస్ రైస్ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ ఐపీఎస్
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి : ప్రభుత్వం ప్రజలకు సన్నబియ్యాన్ని అందిస్తున్న సమయంలో అక్రమార్కులు తమదైన శైలిలో ప్రజలను మోసం చేస్తూ వివిధ అక్రమాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నందు ఇరువురు వ్యాపారులు రాయితీ బియ్యాన్ని పలు బ్రాండెడ్ బియ్యం సంచులలో నింపి ప్రజలకు అధిక డబ్బుకు విక్రయిస్తూ మోసం చేస్తున్న సంఘటనలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారికి విశ్వసనీయ సమాచారం రాగా ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి తనిఖీ చేయగా శివాజీ చౌక్ నందు ఇద్దరి వ్యాపారుల దుకాణాలలో, దాదాపు 80 క్వింటాళ్ల రాయితీ బియ్యాన్ని ప్రజలకు దుకాణాలలో అమ్ముతున్నటువంటి బియ్యాన్ని జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకొని ఇద్దరిపై ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ రాయితీ బియ్యం దాదాపు 326 బ్యాగుల్లో 79.30 క్వింటల్లా బియ్యం ఉంది.
నిందితుల వివరాలు
1) గూగుల్వర్ రాజేశ్వర్ s/o గణపతి, రజిత కిరాణా, శివాజీ చౌక్.
2) షేక్ అయూబ్ s/o షేక్ ఖాసిం, ఆంధ్ర కిరాణా, శివాజీ చౌక్.
3) షేక్ అస్లాం(పరారీ) , చిలుకూరి లక్ష్మీ నగర్, అదిలాబాద్.
ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న పథకాన్ని దుర్వినియోగం చేస్తున్న ప్రతి ఒకరిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ హెచ్చరించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ రాయితీ బియ్యాన్ని అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ రాయితీ బియ్యం మార్కెట్లో చలామణి లో ఉన్న మంచి బ్రాండ్లు జైశ్రీరామ్, గోల్డెన్ సైకిల్ బ్రాండ్, సూర్య తేజ, మధురం, దీపం, గీతాంజలి, వైట్ ప్లాటినం, శ్రీ దత్త అనే పేర్లతో బ్యాగులను సృష్టించి అందులో పిడిఎస్ రైసు నింపి, మిషన్ తో సీల్ వేసి, అధిక ధరలకు విక్రయిస్తూ, ప్రజలను బురిడీ కొట్టిస్తున్న నేరగాళ్లు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పిఎల్ జీవన్ రెడ్డి, సిసిఎస్ ఇన్స్పెక్టర్ పి చంద్రశేఖర్, వన్టౌన్ సీఐ బి సునీల్ కుమార్, ఎస్సై అశోక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments