
* ప్రజలు బాబాలను నమ్మకుండా చైతన్యంగా వ్యవహరించాలని సూచన.*
*అమాయకులకు, ఆదివాసీలకు తాయిత్తులతో వ్యాధులు, రోగాలు నయమైతాయని నమ్మిస్తూ మోసం చేస్తున్న నిందితుడు.*
*నిందితునిపై ఇచ్చోడా పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు.*
*నిందితుడు షేక్ అహ్మద్ s/o షేక్ గుల్వీర్, కోకస్మన్నూర్, ఇచ్చోడ మండలం అరెస్ట్*
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్:
ఇచ్చోడా సీఐ బండారి రాజు తెలిపిన వివరాల ప్రకారం, ఇచ్చోడ మండలం కోకస్మన్నూరు గ్రామానికి చెందిన నిందితుడు *షేక్ అహ్మద్* s/o షేక్ గుల్వీర్, ప్రజల వద్ద తాయెత్తులు కడుతూ వ్యాధులు రోగాలు నయం చేస్తానంటూ బురిడీ కొట్టిస్తున్న సందర్భంలో ఇచ్చోడ పోలీసులు నిందితునిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలందరూ ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా ప్రభుత్వ ప్రైవేటు రంగ వైద్యులను సంప్రదించాలని బాబాలను నమ్మడంతో ఎలాంటి ఉపయోగం ఉండదని తెలిపారు. మంత్ర తంత్రాలతో వ్యాధులు నయం కావనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. ఇలాంటి బాబాలు మరే ఏ గ్రామంలో అయినా ప్రజలను మోసం చేస్తున్నట్లు తెలిసిన యెడల జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని సంప్రదించాలని వారిపై తగు చర్యలను తీసుకుంటుందని తెలిపారు.

Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments