* ఆర్టిఏ ఈ చలాన్ పేరుతో వాట్సాప్ నందు ఫేక్ అప్లికేషన్ చక్కర్లు
* ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన.*
* వాట్సప్ గ్రూపులలో అడ్మిన్ లు ఇలాంటి వాటిని వెంటనే తీసివేయాలి
* నకిలీ అప్లికేషన్ల ద్వారా డాటా చోరీ, సైబర్ క్రైమ్ జరిగే ఆస్కారం
* సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930 కి సంప్రదించాలని సూచన
ఆదిలాబాద్ : ప్రస్తుత సమాజంలో సైబర్ నేరాలు పెరుగుతున్న సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా నందు నకిలీ అప్లికేషన్లు ఏపీకె ఫైల్స్ వాట్సాప్ గ్రూపుల నందు తిరుగుతున్న సందర్భంలో ప్రజలు అప్రమత్తతో వ్యవహరించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలియజేశారు.
ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టిఏ ఈ చలాన్ పేరుతో ఏపీకె ఫైల్ తిరుగుతున్న సందర్భంలో జిల్లా ఎస్పి పత్రికా ప్రకటన ద్వారా ప్రజలకు ప్రజలందరికీ అవగాహన కలిగి ఉండాలని వివరాలను వెల్లడించారు. ఏపీకే ఫైల్స్ ద్వారా డాటా చోరీ, సైబర్ క్రైమ్ జరిగే అవకాశాలు ఉన్నంత వాటిని ఇన్స్టాల్ చేయకుండా ఉండాలని సూచించారు.
అలాంటివి గ్రూపు నందు సంచరిస్తే గ్రూప్ అడ్మిన్లు సభ్యులు దానిని గ్రూప్ నందు తీసివేయాలని సూచించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి ఫోన్ ద్వారా సంప్రదించాలని సూచించారు. ఎలాంటి సోషల్ మీడియా లేదా డబ్బు నష్టపోయినట్లైతే గోల్డెన్ హవర్ లోపు సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ కు సంప్రదించాలని సూచించారు.
Recent Comments