ePaper
Friday, May 1, 2026
📄 ePaper

గణపతి నిమర్జనోత్సవానికి పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు.

📰 Generate e-Paper Clip

అడుగడుగునా పోలీస్ నిఘా… బందోబస్తులో పాల్గొననున్న 600 మంది పోలీసు సిబ్బంది

350 సీసీటీవీ కెమెరాలతో, డ్రోన్ కెమెరాతో నిఘా

8 సెక్టర్లు,8 క్లస్టర్లు, 23 – పికెట్స్, రూఫ్ టాప్ బందోబస్తు, హైవే పెట్రోలింగ్ ప్రత్యేకం

ఇద్దరు సీఐలు 15 మంది బృందంతో 2 స్ట్రైకింగ్ ఫోర్స్ లు

రెండు బృందాలుగా సివిల్ డ్రెస్ నందు పోలీసు సిబ్బంది

ప్రజలకు అందుబాటులో పట్టణంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు

రెండు నిమజ్జన ప్రదేశాలలో బందోబస్తు ఏర్పాటు

పోలీసు అధికారులు,క్లస్టర్, సెక్టార్ సిబ్బందితో సమావేశం సూచనలు

— జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్

ఆదిలాబాద్ : పట్టణంలోని గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుని నిమర్జన కార్యక్రమానికి సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి అప్రమత్తతో ఉంటూ పటిష్ట బందోబస్తు చర్యలను చేపట్టిందని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు. ముఖ్యంగా పట్టణంలో 600 మంది పోలీసు సిబ్బందితో నిమర్జనోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రత్యేకంగా 350 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి 24 గంటలు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. పట్టణంలో 8 క్లస్టర్లు ఎనిమిది సెక్టార్లుగా విభజించిన సిబ్బందిని అడుగడుగునా పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంత వాతావరణంలో గణపతి ఉత్సవాలను పూర్తి చేసుకొని నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. పట్టణంలో ముఖ్యమైన ప్రదేశాల నందు సమస్యత్మక ప్రాంతాల నందు 23  పికెట్స్ ను ఏర్పాటు చేసి శాశ్వతంగా పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశారు.

ప్రత్యేకంగా సిఐ స్థాయి అధికారిని ఏర్పాటు చేసి రెండు స్ట్రైకింగ్ ఫోర్సులను ఏర్పాటు చేసి 15 మంది పోలీసు సిబ్బందిని అందుబాటులో ఉంచారు. పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క దారిలో సెక్టర్ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తూ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పర్యవేక్షిస్తారన్నారు. ప్రధానమైన రోడ్ల నందు రూఫ్ టాప్ బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. పట్టణంలో 15 మంది కెమెరా సిబ్బందిలను ఏర్పాటు చేసి సమస్యల సృష్టించే వారిని వీడియోగ్రఫీ ద్వారా గుర్తించడం జరుగుతుందన్నారు, డ్రోన్ కెమెరాతో పట్టణంలోని పరిస్థితిని పర్యవేక్షించడం జరుగుతుందన్నారు.

ప్రత్యేకంగా రెండు బృందాల సిబ్బందిని మఫ్టీ లో ఉంచి ఆకతాయిల మరియు ప్రజలను రెచ్చగొట్టే వారి పై నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా 20 మంది స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది పట్టణంలో విధులను నిర్వర్తిస్తుండన్నారు. ప్రజలు తెలియజేసినటువంటి సూచనలు పాటించాలని తెలిపారు. నిమర్జనం ఉత్సవాలలో డీజే లకు అనుమతి లేదని, కనులకు హాని చేసే లేజర్ లైట్లకు, పేపర్ సెల్ లో యంత్రాలకు అనుమతులు లేవని తెలిపారు. ఓపిక తో ఉంటూ ప్రజలతో ప్రశాంతంగా వ్యవహరిస్తూ ముందుకు సాగించాలని సూచించారు. పట్టణంలో 15 మంది సీఐలు, నలుగురు డిఎస్పీలో,ఇద్దరు అడిషనల్ ఎస్పీ లను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన ఐపిఎస్ పర్యవేక్షిస్తూ బందోబస్తు కొనసాగించడం జరుగుతుందన్నారు. చివరి గణపతి నిమర్జనం పూర్తి అయ్యేంతవరకు జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తతోనే వ్యవహరిస్తుందని శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా సిబ్బందికి సూచనలు చేయడం జరిగిందని తెలిపారు. పట్టణంలో ప్రజలకు సమాచారం తెలిపేందుకు రెండు కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి సమాచారం అందించబడుతుందన్నారు.

అదేవిధంగా రెండు నిమర్జనం ప్రదేశాలు పెన్గంగా మరియు చాంద టి నందు మహిళా సిబ్బందితో కలిపి బందోబస్తు ఏర్పాటు చేసి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పర్యవేక్షించమని సూచించారు.

ఈ కార్యక్రమంలో డిఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్ జీవన్ రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!
https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88