Sunday, January 25, 2026

రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడమే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి

*ప్రతి ఒక్కరికి మోటార్ వెహికల్ యాక్ట్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలి, తప్పకుండా వాటిని పాటించాలి

*జిల్లా ప్రజలు, తల్లిదండ్రుల పాత్ర కీలకమైనది*

*త్వరలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ చలాన్ సిస్టం ప్రారంభం

*ఆదిలాబాద్ పట్టణంసిసిటివి కెమెరాల నిఘాలో ఉంది

*ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించని వారిపై సిసిటివి డేగ కన్ను

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :  శుక్రవారం స్థానిక కమాండ్ కంట్రోల్ సెంటర్ యందు ట్రాఫిక్ నియమాలు మరియు ప్రమాదాల నివారణ పై జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి పాత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడమే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యంగా, పెరుగుతున్న వాహనాలు దృష్ట్యా, జిల్లాలో ప్రమాదాల సంఖ్య గత సంవత్సరం కంటే పెరిగిందని వాటిని నివారించేందుకు జిల్లా పోలీసు వ్యవస్థ నిర్విరామంగా కృషి చేస్తుందని, దీనికి ముఖ్యంగా జిల్లా ప్రజలు నియమ నిబంధనలు పాటించి  సహకరించాలని కోరారు.

పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి

ఆదిలాబాద్ పట్టణంలోని పలు కూడళ్లలో ప్రత్యేకమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అతి త్వరలో ప్రారంభం కానున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ చలాన్ సిస్టం ఇకనుండి ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కమాండ్ కంట్రోల్ లో ఏర్పాటుచేసిన ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ఆధారిత సీసీ కెమెరాల ఆధారంగా జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా తల్లిదండ్రులకు, పిల్లలకు మోటార్ వెహికల్ యాక్ట్ నియమ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని ఎట్టి పరిస్థితుల్లోనూ త్రిబుల్ రైడింగ్, రాంగ్ సైడ్ వెహికల్ డ్రైవింగ్, నంబర్ ప్లేట్ లేకుండా వాహనాన్ని నడపడం, రిజిస్ట్రేషన్ లేకుండా వాహనాలను నడపడం, సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాన్ని నడపడం లాంటివి చేయకూడదని తెలిపారు. ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి జిల్లా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు, తరచూ ట్రాఫిక్ నియమాలపై స్పెషల్ డ్రైవ్లు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. జరుగుతున్న ప్రమాదాలలో ద్విచక్ర వాహనదారులు అందులో యువత బలవుతున్నారని దేశ భవిష్యత్తును నిర్ణయించే యువత ప్రమాదాలకు లోనవడం బాధాకరంగా ఉందని తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలో చక్కటి  ట్రాఫిక్ వ్యవస్థ నెలకొల్పబడి ఉందని వాటిని సక్రమంగా పాటించినచో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా సురక్షితంగా గమ్యస్థానం చేరుకోవచ్చని సూచించారు. ప్రమాదాల సంఖ్య తగ్గడానికి ప్రజల్లో చైతన్యం రావాలని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని తెలిపారు. సమయం, దూరం కలిసి వస్తుందని రాంగ్ సైడ్  ప్రయాణం చేస్తే ప్రమాదాల బారిన పడతారని, వారిపై ఆధారపడి ఒక కుటుంబం జీవిస్తుందని వాహనం నడిపే ప్రతిక్షణం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ముఖ్యంగా ప్రజలు ఇతరుల నుండి వాహనాన్ని కొనుగోలు చేసి తమపై రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉండడం వల్ల అమ్మిన వాహనదారుడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ఆదిలాబాద్ పట్టణం, ఎంట్రీ, అండ్ ఎగ్జిట్ పాయింట్స్ అన్ని సీసీటీవీ కెమెరాల నిఘా లో ఉందని ఎటువంటి నేరమైన చేసి తప్పించుకుని అవకాశం లేదని తెలిపారు.                                       ఈ కార్యక్రమంలో పట్టణ డిఎస్పి వి ఉమేందర్, సిఐలు పి సురేందర్, కే మల్లేష్, బి రఘుపతి, జె గుణవంత్ రావ్, ఎస్ ఐ ఎం ఎ హకీమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!