— తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ
— జిల్లావ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో, పోలీస్ కార్యాలయాల్లో తీవ్రవాద వ్యతిరేక దినోత్సవ ప్రతిజ్ఞ కార్యక్రమం
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
శనివారం దేశవ్యాప్తంగా తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా లోని పోలీసులు అన్ని పోలీసు స్టేషన్ల వారీగా మరియు కార్యాలయాల్లో తీవ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసు ఏ ఆర్ హెడ్ కోటర్స్ యందు నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎంటిఓ బి శ్రీ పాల్ ప్రతిజ్ఞ చేయిస్తూ జిల్లా ఎస్పీ, అడిషనల్ ఎస్పీ మరియు సిబ్బంది దానిని అనుసరించారు.
*”భారతీయులమైన మేము, మా దేశ అహింస మరియు సహనం యొక్క సంప్రదాయాన్ని దృఢంగా విశ్వసిస్తాము మరియు మేము అన్ని రకాల ఉగ్రవాదం మరియు హింసను గట్టిగా వ్యతిరేకిస్తామని గంభీరంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. మానవ జాతిలోని అన్ని వర్గాల మధ్య శాంతి, సామాజిక సామరస్యం మరియు అవగాహనను కొనసాగించడానికి మరియు మానవ జీవిత విలువలను బెదిరించే విధ్వంసక శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని మేము ప్రమాణం చేస్తున్నాము.”* అని ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మే 21ని తీవ్రవాద వ్యతిరేక దినంగా పాటిస్తారు. ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం యొక్క లక్ష్యం జాతీయ ప్రయోజనాలకు ఉగ్రవాదం ఎంత వ్యతిరేకమో చూపడం ద్వారా యువతను భీభత్సం మరియు హింసా మార్గం నుండి దూరం చేయడం. పైన పేర్కొన్న లక్ష్యాన్ని సాధించడానికి, గతంలో కూడా వివిధ తీవ్రవాద వ్యతిరేక కార్యక్రమాలు మరియు కార్యకలాపాలు నిర్వహించబడ్డాయి అని తెలిపారు.
అదేవిధంగా తీవ్రవాద వ్యతిరేక కార్యక్రమాల్లో తెలంగాణ పోలీసుల పాత్ర కూడా దానికి ఎంతో కీలకంగా వ్యవహరిస్తుందని తెలిపారు. తీవ్రవాదుల వల్ల యూనిఫాం సర్వీసెస్ లో ఉన్న వాళ్ళు మరియు ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు అని, దానికి దీటుగానే జాతీయస్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో ఉన్న యూనిఫామ్ సర్వీసెస్ అన్ని కలసికట్టుగా ఉండాలని ఒక సదుద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. సరిహద్దుల్లోనే కాకుండా అంతర్గతంగా ఎందరో మంది తమ ప్రాణాలను అర్పించి దేశానికి రక్షణ కల్పిస్తున్నారని తెలియజేశారు.
దేశ సరిహద్దులు ఎంత ముఖ్యమో అంతర్గత భద్రత కూడా అంతే ముఖ్యమని తెలిపారు. ప్రతి క్షణం కూడా కష్టపడి పని చేసి ప్రజల మన్ననలను పొంది మంచి వారిగా పేరు గడించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎస్ శ్రీనివాస రావు, ఏ ఆర్ డిఎస్పి ఎం విజయ్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు బి శ్రీ పాల్, ఎం వంశీ కృష్ణ, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments