Wednesday, February 12, 2025

బహుజన రాజ్యాధికారమే బి.ఎస్.పి అంతిమ లక్ష్యం
— ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : బహుజనులు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా బి.ఎస్.పి ముందుకు సాగుతుందని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కో ఆర్డినేటర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఏప్రిల్ మాసం 14 వ తేదిన అంబెడ్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రారంభం ఐన బహుజన రాజ్యాధికార యాత్రకు సంఘీభావంగా శనివారం రోజున ఇచ్చోడ మండల కేంద్రానికి వచ్చారు. మొదటగా కొకస్మాన్నూరు గ్రామాన్ని సందర్శించి అంబెడ్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి యువతతో మాట్లాడారు,అనంతరం తన రాక సందర్బంగా నిర్మల్ బై పాస్ రోడ్డు నుండి బైక్ ర్యాలీ స్వాగతముతో ఇచ్చోడ లోని స్థానిక అంబెడ్కర్ చౌరస్తాలో అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రసంగించారు, తను మాట్లాడుతూ బహుజనులంతా ఏకతాటిపై నడిచి  దొర పాలనకు చరమగీతం పలకాలని, విద్యకు ప్రాధన్యతనిచ్చి హక్కులకై, అధికారంకై పోరాడాలని, బహుజనుల  రాజ్యాధికారమే బీఎస్పీ అంతిమ లక్ష్యమని అన్నారు, ఈ కార్యక్రమములో జిల్లా బీఎస్పీ ఇంచార్జ్ మెస్రం జంగుబాబు, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు గడుగు మహేందర్,జిల్లా ప్రధాన కార్యదర్శి కామెరి పోశెట్టి,పాముల హరినాథ్, పవన్ కళ్యాణ్,యాట రాజేష్ మరియు ఆయా గ్రామాల కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు..


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

Translate »
మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి