రైతు రుణమాఫీ లో దళారుల మాఫియా, రైతుల రుణమాఫీ లో కొత్త తరహా మోసం
బ్యాంకుల ద్వారా రైతులు తీసుకున్న పంట రుణాన్ని దళారులే కట్టి, తిరిగి కొత్తగా దానికన్నా పెంచిన రుణాన్ని రైతులకు బ్యాంకు ద్వారా ఇప్పించి, వారి వద్ద 5-10 వేలు వసూలు చేస్తూ మోసం చేస్తున్న దళారులు.
*జిల్లా వ్యాప్తంగా 34 మంది పై చీటింగ్ కేసు నమోదు.*
*వారి వద్ద నుండి పలు పత్రాలు స్వాధీనం.
బుధవారం రైతుల వేషధారణలో వెళ్ళి మోసం చేస్తూన్న దళారులను పట్టుకున్న పోలీసులు
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ప్రతి సంవత్సరం రైతుకు బ్యాంకు ద్వారా రుణం లభిస్తుందని, ఆ రుణానికి ఏడు శాతం వడ్డీ ఉంటుందని, ఒకవేళ సంవత్సరంలోపు రుణాన్ని తీరిస్తే మూడు శాతం బోనస్ తిరిగి వస్తుందని,ఆ రుణాన్ని కట్టిన తర్వాత తదుపరి రుణం 20 నుండి 30 శాతం వరకు పెంచి బ్యాంకు ద్వారా రైతులు తిరిగి మళ్లీ రుణాన్ని సంపాదించవచ్చని, ప్రభుత్వం ఇలాంటి సౌలభ్యం రైతులకు అందించిందని ప్రజలందరికీ తెలుసు. బ్యాంకుల ద్వారా ఉన్న ఈ లొసుగును వాడుకుంటున్న మోసగాళ్లు, కేటుగాళ్లు జిల్లా నందు అమాయక రైతుల వద్ద ప్రతి సంవత్సరం రైతులకు తీసుకున్న రుణాలను వారే వడ్డీతో సహా కట్టేసి, తిరిగి రైతుల కు అధిక రుణాన్ని తీసుకున్న దానికన్నా అధికంగా వచ్చేలా చేసి, వచ్చిన తేడాలో రైతుల వద్ద నుండి దాదాపు ఒక రైతు నుండి 5000 నుండి 10000 వరకు వసూలు చేస్తూ రైతులను నిండా ముంచుతున్న దళారులు.

ఈ తరహా మోసాన్ని గ్రహించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ బుధవారం జిల్లా వ్యాప్తంగా 9 మండలాలలో జిల్లా పోలీసలే రైతులుగా వేషధారణ మార్చి 16 బృందాలను ఏర్పాటు చేసి బ్యాంకులకు తరలించగా, రైతులను మోసం చేయాలనే నేరస్వభావం కలిగిన దళారులు పోలీసులతో బేరసారాలు చేయడం, రైతు రుణమాఫీ తామే కట్టి ఎక్కువ రుణాన్ని కేటాయించి వచ్చిన దానిలో తమకు వాటా ఇయ్యాలని బేరసారాలు ప్రారంభించారు.

ఇలా జిల్లా లోని వివిధ బ్యాంకుల వద్ద రైతులను మోసం చేస్తున్న 34 మంది దళారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఏర్పాటు చేసిన బృందాలలో జిల్లా పోలీసులు స్వయంగా రైతుల వేషాలలో ఉండటం గమనార్థం. రైతులను మోసం చేస్తే సహించేది లేదని, ప్రభుత్వం ద్వారా అందించే పథకాలను దుర్వినియోగం చేస్తూ ప్రతి సంవత్సరం రైతుల వద్ద నుండి డబ్బులను దండుకుంటున్న దళారుల పట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తుందని జిల్లా ఎస్పీ తెలిపారు.
బ్యాంకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని దళారులు, మధ్యవర్తులను రైతులకు దూరంగా ఉండే విధంగా సూచనలు అందించాలని తెలిపారు. జిల్లాలోని ఉట్నూర్, నార్నూర్, నేరడిగొండ, ఇచ్చోడా, బేల, తలమడుగు, బీంపూర్, మావల, ఇంద్రవెల్లి ప్రాంతాలలో జిల్లా పోలీసులు స్వయంగా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి 34 మంది నిందితులను పట్టుకోవడం జరిగిందని, వారందరిపై ఆయా పోలీస్ స్టేషన్లో పరిధిలో సెక్షన్ 318 ప్రకారం చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
వివిధ మండలాలలో రైతులను మోసం చేస్తూ పోలీసుల చేతికి చిక్కిన దళారుల వివరాలు… మండలాల వారిగా
👉 గుడిహత్నూర్ మండలంలో
1. జయ బాయి శంకర్ s/o ఉదవ్,
2. అడే జైపాల్ s/o దశరథ్,
3. తిక్డే సాగర్ s/o అంగద్ రావు,
4. గుగ్గే రాందాస్ s/o విఠల్,
5. ముండే రాందాస్ s/o కిషన్ రావు,
6. సాంబేట కరుణాకర్ s/o రాజేష్,
7. ఖండార్కర్ రమేష్ s/o దత్తు,
8. కతురే భారత్ s/o దిగంబర్,
9. జాదవ్ దినేష్ s/o సకారం,
👉 ఉట్నూరు మండలంలో
1) జాదవ్ హరి s/o తొలారం
2) కుమ్ర దౌలత్ రావు s/o సీతారం
3) అర్సుల్వాద్ భీమ్ రామ్ s/o సవైరాం
4) రాథోడ్ గబ్బర్ సింగ్ s/o రాంజీ
5) జాదవ్ తానాజీ s/o వెంకట్ రావ్
👉 నార్నూర్ మండలంలో
1) జాదవ్ రాహుల్ s/o రమేష్
2) జాదవ్ బిక్షపతి s/o గణేష్
3) రాథోడ్ అనిల్ s/o రమేష్
4) జాదవ్ నీలేష్ s/o అంబర్ సింగ్
5) జాదవ్ విజయ్ కుమార్ s/o వెంకట్ రామ్
6) రాథోడ్ సురేష్ s/o యశ్వంత్ రావ్
7) రాథోడ్ దుదిరం s/o కున్యా
8) రాథోడ్ యశ్వంతరావు s/o
తారాచంద్.
9) రాథోడ్ కార్తీక్ కుమార్ s/o గుణవంతురావ్
10) రాథోడ్ రాజేష్ s/o వెంకట్ రామ్
11) రాథోడ్ గణేష్ s/o తరచంద్.
👉 బేల మండలంలో
1) మహమ్మద్ అయూబ్
2) సిర్పూర్ కార్ సంజీవ్
3) మురాడి సురేష్
👉 భీంపూర్ మండలంలో
1) కుమ్రపు అశోక్
2) రెడ్డివారి దేవన్న.
👉 మావల మండలంలో
1) చక్రం దేవరావు
👉 ఇంద్రవెల్లి మండలంలో
1) నార్వాటి రాము
2) కొమర రామ్ షావ్
3) ఫారూఖ్
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments