📰 బాధితురాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి…
◾️తుడుం దెబ్బ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు ఉయిక ఇంద్ర డిమాండ్
రిపబ్లిక్ హిందుస్థాన్, అదిలాబాద్ : తలమాడుగుమండలంలోని డోర్లు గ్రామంలో గిరిజన మహిళపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించడంతోపాటు బాధితురాలకు తక్షణంతోపాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని తుడుం దెబ్బ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు ఉయిక ఇంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అత్యాచారం చేసిన నలుగురిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు మునుముందు ఇలాంటి విషయాలు బలోపేతం కాకుండా చూడాలన్నారు. మహిళ పై సామూహిక అత్యాచారం చేయడం ఎంతో దారుణమైన విషయమని అన్నారు. అత్యాచార విషయం బయట పోకుండా చూడటం ఒకవేళ బయట చెప్తే చంపేస్తామని బెదిరించడం వంటి చేసిన కిరాచకులకు ఉరిశిక్ష విధించాలని ఆమె ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అత్యాచారం చేసిన సమయంలో మహిళ మృతి చెందినట్లయితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాల్సిన విషయం అన్నారు. అంతేకాకుండా అత్యాచార చేసిన నిందితులు చంపివేస్తామని బెదిరించడం దారుణమైన విషయమని అలాంటి నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే తుడుం దెబ్బ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో పెందుర్ ప్రియాంక,ఆదివాసీ భారత్ మహా సభ అదక్షురాలు మెస్రం మీన, బర్జబాయి తదితరులు ఉన్నారు.
Recent Comments