అసౌకర్యల నడుమ కొనసాగుతున్న ప్రభుత్వ పాఠశాలలు….
కొన్నిచోట్ల బురద మయంగా ప్రభుత్వ పాఠశాలలు
మరికొన్ని చోట్ల పురుగుల అన్నం, పుడ్ పాయిజాన్ వంటి ఘటనలు….
తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
సమస్య పరిష్కారం కోసం రోడ్డెకేనా మారని పరిస్థితి…
పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
రిపబ్లిక్ హిందుస్థాన్, వరంగల్ /ఆదిలాబాద్ : ఒక పక్క ప్రభుత్వం కేజీ టూ పీజీ ఉచిత విద్య నినాదం తో పాటు మన ఊరు మన బడి కార్యక్రమం పేరిట కోట్ల రూపాయలు ప్రచారం కోసం ఖర్చు చేస్తున్న సర్కారు. ఇది కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమైందా!?.. అనేటట్లు రాష్ట్రం లో జరుగుతున్నా ప్రస్తుత పరిస్థితులను బట్టి తెలుస్తుంది. రాష్ట్ర విద్యా వ్యవస్థ గాడి తప్పిందనడానికి ఈ మధ్య విద్యార్థులు తరుచు తమ సౌకర్యాల మెరుగుదల కోసం, సమస్యల పరిష్కారం కోసం చేస్తున్నా పోరాటాలను బట్టి తెలుస్తుంది. ప్రభుత్వ పాఠశాలలు అసౌకర్యాలకు నిలయంగా మారుతున్నాయి. ఫలితంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు అసౌకర్యానికి గురవుతున్నారు. రాష్ట్రం లో ఎక్కడో ఒకచోట రొజు విద్యార్థులు రోడ్డెక్కి తమ నిరసన గళం వినిపిస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల సమస్య పరిష్కారం అయినట్లే అనుకున్న వేళ మళ్ళీ అక్కడ విద్యార్థులు నిరసన చేపట్టారు.
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో ఇలా

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రం లోని ప్రభుత్వ పాఠశాలలో అసౌకర్యల నడుమ విద్యా కొనసాగుతుంది. పాఠశాల భవనం
ఈ విషయమై విద్యార్థులు ఉపాధ్యాయుల వేతలు అధికారుల చెవికి ఎక్కడం లేదు. మన ఊరు మనబడి కార్యక్రమంలో పాఠశాలలను అభివృద్ధి చేస్తున్న కొన్నింటికే నిధులు కేటాయిస్తుండడంతో ఈ దుస్థితి నెలకొంది. నల్లబెల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ పాఠశాలలో ఇటీవల కురిసిన వర్షానికి పాఠశాల ప్రాంగణమంతా చిత్తడి చిత్తడిగా మారింది. వర్షం నీళ్లు నిలవడంతో బురదమయంగా మారి పాఠశాల ప్రాంగణంలో నడవడానికి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంత దుస్థితి నెలకొన్న అధికారులు కనీసం కన్నెత్తి చూడటం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పాఠశాలలో మరమ్మతు పనులు చేపట్టాలని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
నిమ్మెత్తిన గోడలు
గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాఠశాల గోడలపై వర్షపు నీరు పడడంతో గోడలు నిమ్మించి తరగతి గదులకు నీరు వస్తుంది. దీంతో విద్యార్థులు భయపడుతూ తరగతి గదిలో విద్యను అభ్యసిస్తున్నారు. తరగతి గది గోడలకు మరమ్మతులు జరిపించాలనీ విద్యార్థులు కోరుతున్నారు.

పనిచేయని ఫ్యాన్స్
తరగతి గదులలో ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించేందుకు ఏర్పాటు చేసిన ఫ్యాన్లు పనిచేయకుండా గోడలకే పరిమితమయ్యాయి. సరైన ఎలక్ట్రిక్ వైరింగ్ లేకనే ఈ సమస్య తలెత్తింది. ఇకనైనా అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం లో బస్సు సౌకర్యం కోసం
ఆదిలాబాద్ : బజార్హత్నూర్ మండల కేంద్రానికి ఆనుకొని నిర్మిస్తున్న నూతన బ్రిడ్జి పనులు ఆగిపోవడంతో తాత్కాలికంగా వేసిన రోడ్డు వరదలకు కొట్టుకపోయి పూర్తిగా కనుమరుగై పోవడంతో మండల కేంద్రానికి విద్యను అభ్యసించడానికి పలు గ్రామాల నుండి మండల కేంద్రానికి రాకపోకలు కొనసాగించే విద్యార్థుల కష్టాలు వర్ణాతీతం. మండలంలోని పలు గ్రామాల నుంచి వస్తున్న విద్యార్థులు బుధవారం రోజు ఉదయం చాలా ఇబ్బంది పడ్డారు. తీవ్ర ఇబ్బందులు పడ్డ విద్యార్థులలు మనోవేదనకు గురైన ఉదయం 9 గంటల నుంచి మండల కేంద్రంలోని ప్రధాన కూడలి అయిన శివాజీ చౌక్ సోనాల వెళ్లే దారిలో బైఠాయించి ధర్నా నిర్వహించారు. తక్షణమే మాకు రోడ్డు సౌకర్యం కల్పించాలని వి వాంట్ రోడ్డు అని ధర్నా కార్యక్రమం చేపట్టారు. ప్రధాన కూడలి వద్ద వాహనాలు ఈ ఆందోళన వల్ల ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సు సైతం నిలిచిపోయి రాకపోకలు స్తంభించిపోయాయి. విద్యార్థులు ఎమ్మెల్యే రావాలి అంటూ, కాంట్రాక్టర్ రావాలి అంటూ మా సమస్య పరిష్కరించాలి అని నిరసన వ్యక్తం చేశారు. సదరు గుత్తేదారు తాత్కాలిక రోడ్డుకు సిమెంట్ పైపులు పెద్ద వాటికి బదులు చిన్నవి పైపులు వేయడం వలన రోడ్డు మొత్తం బురద నీటితో కొట్టుకుపోయినట్లు తెలుస్తుంది. బజార్ హత్నూర్ ఎస్సై ముజాహిద్దీన్ అక్కడకు చేరుకొని ధర్నా విరమింప చేయాలని తెలుపగా , తక్షణమే మా డిమాండ్ నెరవేర్చాలని విద్యార్థులు అన్నారు. పై అధికారుల తో మాట్లాడి సమస్య పరిష్కారం జరిగేలా చూస్తామని తెలపడం తో విద్యార్థులు ధర్నా విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తోపాటు మండల వైస్ ఎంపీపీ పోరెడ్డి శ్రీనివాస్, బిజెపి సోషల్ మీడియా కన్వీనర్ గాజుల రాకేష్, నాయకులు బత్తిని సుధాకర్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments