ఆదిలాబాద్ దేవి బార్ కత్తితో పొడిచి చంపిన హత్య కేసులో నిందితుని అరెస్టు
వివరాలు వెల్లడించిన అదిలాబాద్ డిఎస్పి వి ఉమేందర్
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ (క్రైం న్యూస్ ) :
ఆదిలాబాద్ జిల్లాలో సంచలనంరేకెత్తించిన దేవి బార్ ముందు జరిగిన హత్య కేసులో నిండుతుడిని ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు.
అదిలాబాద్ డిఎస్పీ వి ఉమేందర్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం ఆదిలాబాద్ జిల్లా విద్యానగర్ కు చెందిన గుడ్ల సావిత్రి మరియు ప్రభుత్వ రిటైర్డ్ ఉపాద్యాయుడు స్వర్గీయ గుడ్ల లింబాద్రి దంపతుల కుమారుడు అయినా గుడ్ల సాయికుమార్ (31) డిగ్రీ చదువుకుంటున్నాడు. ఇంటి నుండి వెళ్లిన సాయి కుమార్ సాయంత్రం 7 గంటలకు ఒకసారి తన తల్లికి ఫొన్ చేసి మాట్లాడుకున్నాడు.

అదే రోజు రాత్రి అందజ 9.00 గంటలకు మృతుయ సమయంలో నేరస్తుడు తోరాత్ ప్రితం (36) గంజాయి డాన్ అని మృతుని కి తెలిసినది. మృతుడు సాయికుమార్ కు భార్ కౌంటర్ వద్ద నేరస్తుడు తోరత్ ప్రితం తో పరిచయం అయింది.
అయితే 11.00 గం” లకు మల్లి మృతుడు మరియు నేరస్తుడు ప్రితం లు దేవి బార్ కౌంటర్ వద్ద తారస పడ్డారు. అప్పుడు మృతుడు నేరస్తుని గంజాయి డాన్ అని, పిల్లల ఆరోగ్యాలను గంజాయి అమ్మి చెదగోడుతున్నాడని అతని మిత్రుడు అయిన అస్వద్ కు తెలుపగా , ఇది విన్న వెంటనే నేరస్తుడు మృతున్ని అమ్మనా బూతులు తిట్టి బయటకు రా ని అంతు చూస్తా అని బెదిరించి నడుచుకుంటూ బార్ బయటకు వెళ్ళుచుండగా నేరస్తునికి బయపడి బార్ లో ఉన్న క్రేటర్ తీసుకొని బార్ బయటకు వెళ్ళగా వెంటనే నేరస్తుడు అతని వద్ద ఉన్న చాకు తో సాయికుమార్ ను చాతిలో పొడిచాడు.

అదేరోజు రాత్రి అందాజా 01.00 గంటలకు ఫిర్యాదిరాలు చిన్న అల్లుడు సర్తాజ్ ఎవరో సాయి కుమార్ ను కత్తితో పొడవటం వలన రిమ్స్, ఆదిలాబాద్ కు చికిత్స గురించి తరలించగా మరణించినట్లు డాక్టర్ తెలిపినాడు అన్ని పిర్యాదురాలితో తెలుపగ, ఇట్టి విషయంలో ఫిర్యాదిరాలు ఎలా జరిగింది అని తెలుసుకోగ దేవి బార్ అండ్ రెస్టారంట్ వద్ద ప్రీతం మరియు ఇతరుల పైన పిర్యాదు ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
మృతుడి తల్లి గుడ్ల సావిత్రి ఫిర్యాదు మేరకు కేసు
In Cr.No:215/2022, U/Sec 302 IPC of PS లో తేదీ 14.07.2022 నాడు రాత్రి 01.30 గం. ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ వన్ టౌన్ ఆదిలాబాద్ కేసు నమోదు చేసి నేరానికి సంబందించిన్న సిసిటివి ఫుటేజి మరియు ప్రత్యక్ష సాక్షులను విచారించి దర్యాప్తు చేయగా హత్యకు పాల్పడింది నేరాచరిత్ర కల్గిన తోరథ్ ప్రితం అని గుర్తించి అరెస్ట్ చేశారు.
నేరస్తుడి నేర చరిత్ర….
నేరస్తుడు దాదాపు 10 సం” ల నుండి ఆదిలాబాద్ రూరల్, మావాల మరియు ఉట్నూర్ ప్రాంతాలలో గంజాయి వ్యాపారం చేస్తున్నాడు ఇప్పటివరకు ఇతని పై 5 గంజాయి కేసులు 1) ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్, 2) మావల పోలీస్ స్టేషన్ మరియు 3) ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లలో కేసులు ఐనవి మరియు ఇతర రాష్ట్రాలలో కూడా గంజాయి వ్యాపారం చేస్తాడు. ఈ కారణాల వాళ్ళ ఆత్మరక్షణ కొరకు ఎల్లప్పుడూ చాకు (కత్తి) తన వద్ద ఉంచుకుంటాడు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments