— ఆదిలాబాద్ డిఎస్పి ఎన్ఎస్వి వెంకటేశ్వరరావు
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
శుక్రవారం జిల్లా వ్యవసాయ అధికారులు, పట్టణ సీఐ లతో కలిసి పట్టణంలోని పలు ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
జిల్లా వ్యాప్తంగా నకిలీ విత్తనాలు ఎరువులు విక్రయించే వద్దు అనే జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం ఆదిలాబాద్ పట్టణం లోని తాంసీ బస్టాండ్ ఏరియాలోని పలు వ్యవసాయ ఎరువుల దుకాణాల్లో ఆదిలాబాద్ డిఎస్పి ఎన్ ఎస్ వి వెంకటేశ్వరరావు, ఒకటవ పట్టణ సీఐ పి సురేందర్, రెండవ పట్టణ సీఐ కే శ్రీధర్ లు కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు .
ఈ సందర్భంగా ఆదిలాబాద్ డీఎస్పీ మాట్లాడుతూ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం నకిలీ విత్తనాలు, ఎరువుల పై జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తగు సూచనలు చేసినట్లు అందులో భాగంగానే పట్టణంలోని పలు దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పక్కా ప్రణాళిక ప్రకారం నకిలీ విత్తనాలను అడ్డుకోవడానికి పటిష్టమైన సమాచార వ్యవస్థ తో కూడిన టాస్క్ఫోర్స్ ద్వారా అడ్డుకునేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలందరికీ నకిలీ విత్తనాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పోలీసు కళాజాత బృందాల చేత కళా ప్రదర్శన చేసి గ్రామాల్లో రైతులను చైతన్యపరిచే విధంగా జిల్లా ఎస్పీ సూచించారని తెలిపారు. రైతులు విక్రయదారులపై ఎలాంటి అనుమానాలున్నా దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ ని సంప్రదించాలని సూచించారు.

ఈ తనిఖీల్లో జిల్లా ఇన్చార్జి వ్యవసాయ అధికారి పుల్లయ్య, ఎ డి ఎ రమేష్, ఏవో రమేష్ ఆదిలాబాద్ ఒకటవ, రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.


Recent Comments