రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ప్రపంచ బంజారా ల ఆరాధ్య దైవాలు అయిన క్యంకాళీ (కాళిక మాత) యాడీ, తోల్జా (తులజ భవాని) యాడీ, మ్యారామ (జగదాంబ మాత) యాడీ, సీత్ల యాడీ(సీతమ్మ మాత), మంత్రాల్(మంత్రాల్ మాత) యాడీ, హింగ్లాజ్ యాడీ(హింగ్లాజ్ మాత), ద్వాల్ అంగల్ యాడీ ఇలా ఏడు అమ్మ వార్లను ఆషాఢ మాసం శుక్ల పక్షం లో మంగళవారం నాడు సీత్ల మాత ఆధ్వర్యంలో కొలువు దీర్చి కొలిచే సీత్ల భవాని పూజ.
రాష్ట్ర వ్యాప్తంగా సీత్ల భవాని పూజ కు 12/07/2022 మంగళవారమున సిద్ధము అవుతున్న 30 లక్షల పై చిలుకు తెలంగాణా రాష్ట్ర గిరిజన లంబాడీ తెగ ప్రజలకు జాతి వేదిక గిరిజన లంబాడీల ఐక్య వేదిక తరుపున శుభాకాంక్షలు తెలుపుతున్నాము అని రాష్ట్ర ముఖ్య సమన్వయ కర్త రమేష్ నాయక్ గుగులోత్ తెలిపారు.
సింధు లోయ నాగరికత గురించి ప్రపంచానికి తెలిసిన తరువాత అందులో బయట పడ్డ అనావాల్లు అన్ని లంబాడీ సమాజనివే అని తెలియ చేయుటకు గర్వపడుతు అలాగే 7 గురు అమ్మ వార్లను కొలువు తీర్చడానికి ఎప్పుడు ఉపయోగించే రాళ్ల మూర్తులు రావడం ఈ రోజు పాకిస్థాన్ లో ఉన్న హింగ్లజ్ మాత శక్తి పీఠం పరిసర ప్రాంతాల్లో కూడా ఇలాంటి 7 గురు దేవత మూర్తులు తవ్వకాలలో బయటపడడం మన సమాజం గమనించాలి అని ఇలాంటి పురాతన సీత్లా భవాని పండగను యావద్ గిరిజన లంబాడీ సమాజం సంతోషం తో జరుపుకుంటూ ఈ రోజు వరకు అటువంటి సంస్కృతిని కాపాడుతూ వచ్చిన నా జాతి పూర్వీకులకు శిరస్సు వంచి ధన్యవాదములు తెలుపుతున్నాను అని రమేష్ నాయక్ గుగులోత్ లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర సమన్వయ కర్త తెలియ చేశారు.
అకాల వర్షాలకు, చెడు వర్షాలకు గోవు లకు వచ్చే గాలి కుంటు వ్యాధి లాంటివి రాకుండా చూసుకోవాలి అని మా గోసంపదను కాపాడాలి ఏడు గురు అమ్మ వార్లకు గుగ్గిలను వండి నైవేద్యం గా పెడతారు.ఇలా తండా మొత్తం నుండి వచ్చిన ప్రసాదాన్ని ఒక కుప్పగా పోసి అందరూ కలిసి నైవేద్యం గా స్వీకరిస్తారు ఇలాగ గిరిజన లంబాడీ సమాజం లో వివక్ష లేదు అని సభ్య సమాజానికి తెలియ చేస్తారు అలాగే గిరిజన లంబాడీ లు మాతృ స్వామ్య వ్యవస్థను పాటిస్తూ తమకు అమ్మ వార్లు రక్ష అని తెలియ చేస్తారు .
అలాగే ఆషాఢ మాసం కొత్తగా పెళ్లి అయిన వారి కుమార్తె లను ఇంటికి పిలిచి వారిని గౌరవముగా చూసుకుంటూ సభ్య సమాజానికి లంబాడీ గిరిజనులకు మహిళ మూర్తుల పై ఉన్న గౌరవాన్ని చాటుకుంటారు. ఇలా సభ్య సమాజానికి ఆషాఢ మాస విశష్టత ను తెలియ చేసిన ఘనత మా పుర్వికులది అని రమేష్ నాయక్ గుగులోత్ తెలియ చేసారు.
ఇలాంటి మా పండగలకు ఇప్పటికీ అయిన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ల ప్రకారం లంబాడీ గిరిజన తెగలు జరుపుకునే సీత్ల భవాని పండుగ, తీజ్ ఉత్సవాలు, సేవాలల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను సెలవుల జాబితాలో చేర్చాలి అని మనవి చేస్తున్నాము.
ప్రతి తండా పంచాయతీ లలో గిరిజన లంబాడీ తెగల పండగలను ప్రభుత్వమే నిర్వహించాలని లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయ కర్త రమేష్ నాయక్ గుగులోత్ విన్నవించారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments