Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పెద్దపల్లి ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా బి. ఓం ప్రకాష్ బాధ్యతల స్వీకరణ

Author
Posted By HINDUSTAN
| 06 Nov 2026, 07:58 PM | TELANGANA
పెద్దపల్లి ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా బి. ఓం ప్రకాష్ బాధ్యతల స్వీకరణ

పారదర్శకమైన పాలన, ప్రజలకు సత్వర సేవలే లక్ష్యం

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా బి. ఓం ప్రకాష్ బాధ్యతలు స్వీకరించారు. పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్ పోస్టు ఖాళీగా ఉన్న నేపథ్యంలో, రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు ఆయనకున్న అనుభవం, విధి నిర్వహణలో చూపిన నిబద్ధత, పరిపాలనా సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయన అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.

పెద్దపల్లి ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా బి. ఓం ప్రకాష్ బాధ్యతల స్వీకరణ - Additional Image

సేవలో నిబద్ధత.. పరిపాలనలో ప్రత్యేక ముద్ర!

గతంలో సుల్తానాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విధులు నిర్వర్తించిన సమయంలో బి. ఓం ప్రకాష్ తన పనితీరు, కార్యదక్షతతో ప్రత్యేక గుర్తింపు పొందారు. కేవలం విధుల నిర్వహణకే పరిమితం కాకుండా, కార్యాలయ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ప్రత్యేక చొరవ కనబరిచారు.

ముఖ్యంగా, శిథిలావస్థకు చేరి ఉద్యోగులు, ప్రజలకు ఇబ్బందికరంగా మారిన సుల్తానాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవన సమస్యను పరిష్కరించడంలో ఆయన చూపిన చొరవ ప్రశంసనీయం. ఈ సమస్యను జిల్లా రిజిస్ట్రార్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, నిరంతర సమన్వయం, కృషితో కార్యాలయానికి అవసరమైన మరమ్మతులు, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేశారు.

దీంతో కార్యాలయ వాతావరణం మెరుగుపడటమే కాకుండా, ఉద్యోగులు విధులు నిర్వహించేందుకు, ప్రజలు తమ రిజిస్ట్రేషన్ అవసరాల నిమిత్తం కార్యాలయానికి వచ్చేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. ఆయన చొరవతో చోటుచేసుకున్న ఈ మార్పులు స్థానిక ప్రజలు, దస్తావేజు లేఖరుల ప్రశంసలు పొందాయి.

ఇవి కూడా చదవండి

పెద్దపల్లిలోనూ ప్రజాకేంద్రిత సేవలకు ప్రాధాన్యత!

ఈ సందర్భంగా బి. ఓం ప్రకాష్ మాట్లాడుతూ, పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్కరికీ నిబంధనలకు లోబడి పారదర్శకమైన, బాధ్యతాయుతమైన, సత్వర సేవలు అందించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి అనవసర ఇబ్బందులు కలగకుండా, వినియోగదారుల సమస్యలకు తగిన ప్రాధాన్యతనిస్తూ కార్యాలయ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు.

రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారుల మార్గదర్శకత్వం, ఆదేశాలకు అనుగుణంగా విధులు నిర్వర్తిస్తూ, శాఖ ప్రతిష్ఠను మరింత పెంపొందించేలా కృషి చేస్తానని వెల్లడించారు. కార్యాలయానికి వచ్చే ప్రజలకు మెరుగైన సేవలందించడంతో పాటు, ఉద్యోగుల సమన్వయం, క్రమశిక్షణ, కార్యాలయ నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.

జిల్లా కలెక్టర్ ప్రశంసలు.. కార్యాలయ అభివృద్ధికి ప్రత్యేక సహకారం!

సుల్తానాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అభివృద్ధి, మరమ్మతుల విషయంలో బి. ఓం ప్రకాష్ చూపిన ప్రత్యేక చొరవ, అంకితభావం, కార్యదక్షతను గుర్తించిన గౌరవ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ కోయ హర్ష గారు ఆయన పనితీరును అభినందించారు. కార్యాలయ భవనం మరమ్మతులు, మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం రూ.3.50 లక్షల నిధులను మంజూరు చేసి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఆయన సంకల్పానికి అండగా నిలిచారు. జిల్లా కలెక్టర్ గారి ఈ ప్రోత్సాహం, సహకారం కార్యాలయ అభివృద్ధికి ఎంతగానో దోహదపడటంతో పాటు, ప్రభుత్వ కార్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పన పట్ల ఉన్నతాధికారుల చొరవకు నిదర్శనంగా నిలిచింది.

ప్రజలకు మెరుగైన సేవలు.. శాఖకు మరింత గౌరవం.. అనే సంకల్పంతో పెద్దపల్లి ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా బి. ఓం ప్రకాష్ బాధ్యతలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.